కరోనా వ్యాప్తికి చెక్ చెప్పేందుకు మాస్కు పెట్టుకోవటం.. భౌతిక దూరంతో పాటు లాక్ డౌన్ కూడా అవసరమన్న మాట బలంగా వినిపించినప్పటికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు సుముఖంగా లేకపోవటం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ.. లాక్ డౌన్ పెట్టేందుకు కేసీఆర్ సర్కారు ఆసక్తి చూపలేదు. ఒక దశలో సీఎస్ అయితే లాక్ డౌన్ అవసరం లేదన్న మాటను చెప్పటం తెలిసిందే. కేసీఆర్ సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. లాక్ డౌన్ పై మీ నిర్ణయాన్ని చెబుతారా? లేదంటే తామే నిర్ణయం తీసుకోవాలా? అని సీరియస్ కావటంతో.. అప్పటికప్పుడు లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
లాక్ డౌన్ పెట్టే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే ఆలోచించిన కేసీఆర్.. లాక్ డౌన్ అమలు షురూ అయిన వారం తర్వాత రాష్ట్రంలో వస్తున్న మార్పులు.. కేసుల నమోదులో తగ్గిన తీరు ఆయనలో కొత్త ఆలోచనలకు తెర తీసినట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. కరోనా పేషెంట్లను పరామర్శించటం కోసం ఆసుపత్రులకు తిరిగిన సందర్భంగా తన వరకు వచ్చిన విషయాలు ఆయనలో చాలానే మార్పును తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
గడిచిన వారం.. పది రోజులుగా కరోనా మీద కేసీఆర్ చేస్తున్న రివ్యూలు అన్ని ఇన్ని కావు. ఒక రకంగా చెప్పాలంటే.. కాస్త ఆలస్యంగా స్పందించిన కేసీఆర్.. ఇప్పుడు అధికారుల్ని పరుగులు తీయిస్తున్నారు. కరోనాతో పాటు విరుచుకుపడుతున్న బ్లాక్ ఫంగస్ మీదా ఆయన ఇప్పుడు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ఆదాయం గురించి ఇంతకాలం ఆలోచించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం సెట్ అయితే.. మామూలు పరిస్థితుల్లోకి వచ్చాక పోగొట్టుకున్న రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి తెచ్చుకోవటం కష్టం కాదన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు.
ఇదే..ఆయనలో మార్పుకు నాందిగా మారిందని.. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయటంతో పాటు.. వైరస్ వ్యాప్తికి ఆయన కొత్త వ్యూహాల్ని తెర మీదకు తెస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ నెలాఖరు వరకు మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం జూన్ 15 వరకు లాక్ డౌన్ అమలు చేసే వీలుందని చెబుతున్నారు. మారిన కేసీఆర్ మైండ్ సెట్ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ జూన్ మొత్తం విధించినా ఆశ్చర్యం లేదని.. కాకుంటే.. జూన్ మధ్య నుంచి ఉదయం పది గంటల వరకు ఉన్న ఆంక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పొడిగిస్తారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.