ఏపీలో పరిస్థితి చూస్తే అందరిలో ఆందోళన కలుగుతోంది. ఆర్ధికంగా రాష్ట్రం ఎలా ఉందో సగటు జనాలకు కూడా తెలిసిపోతోంది. రెవిన్యూ, బడ్జెటు ఇలాంటి పదాలకు అర్ధాలు తెలియకపోవచ్చు కానీ అప్పు అంటే మాత్రం అందరికీ బాగా అర్ధమవుతోంది. మరో వైపు మీడియాలో కూడా ఏపీ అప్పుల పాలు అని ప్రతీ రోజూ వార్తా కధనాలు వస్తున్నాయి. దాంతో జనాల్లో ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న వేదన అయితే ఉంది.
సరే సగటు జనాల్లో ఈ ఆవేదన ఉన్నా ఎవరికీ పట్టదు, దాని గురించి పెద్ద వారు కూడా పట్టించుకోరు. కానీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా ఉంటూ రెండు సార్లు ఎంపీగా అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావుల ఆవేదనకైనా సర్కార్ పెద్దలు జవాబు చెప్పాలిగా. ఇప్పటికి ఎన్నో సార్లు ఉండవల్లి ఏపీలో ఏం జరుగుతోంది. అసలు ప్రభుత్వం వద్ద ఉన్న ధీమా ఏంటి, అప్పుల కుప్పలుగా ఏపీని తయారు చేస్తున్నారు.
ఇలాగైతే రేపటి రోజున రాష్ట్రం అస్థిత్వం ఏంటి అన్నది ఉండవల్లి వారి ఆవేదన. ఆయన మీడియా సమావేశం పెట్టిన ప్రతీసారి దీని గురించే ఎక్కువగా మాట్లాడుతారు. ఏపీ సర్కార్ చేసిన అప్పుల చిట్టా కూడా వల్లె వేస్తారు. తాజాగా మరోసారి ఉండవల్లి ప్రభుత్వాన్ని ఇదే విషయాన ప్రశ్నించారు.
ఏపీ ఇన్నేసి వేల కోట్లను అప్పులుగా తేస్తోంది. అసలు పాలకులకు ధీమా ఏంటి, వీటిని ఎలా తీర్చగలం, మనకు వేరే ఏదైనా నమ్మకం కలిగించే విషయం ఉందా, ఏమీ లేకుండా కాకుండా అప్పులు ఎవరూ చేయరు, ఇది సహజ సూత్రం అని ఉండవల్లి అంటూనే ఏపీ అప్పులు ఇలా ఉధృతంగా చెసుకుంటూ పోవడం వెనక ఉన్న ధైర్యం ఏంటో మాకు సెలవివ్వండి సార్ అని అడుగుతున్నారు.
తాను గతంలో కూడా ఇలా అనేక సార్లు ప్రశ్నించాను కానీ ప్రభుత్వం నుంచి జవాబు లేదని ఆయన అన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ని ఆయన సమర్ధుడిగా చెప్పడం విశేషం. జగన్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మాన్. ఆయనకు వ్యాపారం ఎలా చేయాలో బాగా వచ్చు. ఆయన ఇపుడు సీఎం కాబట్టి ఏపీని ఎలాంటి ఆర్ధిక నష్టాలు లేకుండా ముందుకు తీసుకెళ్తారు అన్న విశ్వాసం అయితే ఉంది.
కానీ మా బోటి వారికి మాత్రం కళ్ల ముందు అప్పులే తప్ప మరేమీ కనిపించడంలేదు, జగన్ ఈ విషయంలో ఏపీ జనాలకు భరోసా ఇస్తే బాగుంటుంది అని అన్నారు. మీరేం కంగారు పడనవసరం లేదు, ఎన్ని అప్పులు తెచ్చినా ఏదోలా తీర్చగలం, ఆ శక్తి మాకు ఉంది. దానికి తగిన రీతిన కసరత్తు కూడా చేస్తున్నాం, మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఆయన ఒక్క మాట చెబితే ఏపీ జనాలకు నిబ్బరంగా ఉంటుంది అని ఉండవల్లి అంటున్నారు.
మరి జగన్ ఈ విషయంలో భరోసా ఇస్తారా. ఏపీలో ఇన్నేసి వేల కోట్ల అప్పులు చేస్తున్నా ఏదో నాటికి ఏదో వేళకు ఏపీ కుదుటపడి వీటిని తీర్చేగలదు అన్న నిబ్బరాన్ని ఆయన ఇవ్వగలరా. ఏమో ఉండవల్లి వారు చెప్పినట్లుగా జనాలకు అయితే భయం ఉంది, కానీ జగన్ ధైర్యం చూస్తూంటే ఫరవాలేదా అని కూడా అనిపిస్తోంది. అయితే ఏ బెంగా లేకుండా జగన్ నేనున్నాను అని ఒక్క మాట గట్టిగా చెబితే బాగుంటుందేమో.
లేకపోతే ఉండవాల్లి వారే చెప్పినట్లుగా దొరికినన్నాళ్ళు అప్పులు చేయడం, ఆ మీదట చేతులెత్తేస్తే ఏపీ కంప్లీట్ గా మునిగిపోవడం ఖాయం. ఒక వ్యక్తి అయినా సంస్థ అయినా, ప్రభుత్వం అయినా అప్పులు తేవడం అంటే బాధ్యతగానే ఉండాలి కదా. మరి అదే పెద్దాయన ఆవేదన. దానికి జగన్ కానీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కానీ జనాలకు ఊరటను ఇచ్చే మాట చెబితే బాగుంటుందేమో.