మాట్లాడితే తాను నిప్పు అని చంద్రబాబు చెప్పుకుంటారు. తన పాలన అంతా స్వర్ణయుగమని, అలాంట్టి జమానా ఎవరూ ఎపుడూ చూసి ఉండరని కూడా గొప్పలు పోతారు. మరి ఆ నిప్పుకు చెదలు పట్టాయని ఈడీ అంటోంది. సాక్ష్తాతూ చంద్రబాబు పాలనలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో అవినీతి జరిగిందని నిధులు వందల కోట్లు పెద్ద ఎత్తున చేతులు మారాయని ఈడీ పేర్కొంటూ ఏకంగా 26మందికి నోటీసులు జారీ చేసింది. ఇద్దరిని అరెస్ట్ చేసింది.
ఈ నోటీసులు అందుకున్న వారిలో బాబు ఏలుబడిలో కార్పోరేషన్ లో పనిచేసిన కీలకమైన వారు ఉన్నారు. ఏపీలో ఇది అతి పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో 250 కోట్ల దాకా దారి మళ్లాయని ఈడీ గుర్తించే నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించింది. వేరొక కేసులో తీగ లాగితే స్కిల్ డెవలపమెంట్ కార్పోరేషన్ అవకతవలక మీద డొంక కదిలింది.
వైసీపీ అయితే ఈ పరిణామాల పట్ల ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ పార్టీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో అతి పెద్ద స్కాం నడిచిందని, కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో అసలైన వారు, తెర వెనక ఉన్న వారు వస్తారని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి జోగి రమేష్ అయితే ఈ కుంభకోణం వెనక చంద్రబాబు లోకేష్ ఉన్నారని వారు కూడా బయటకు వస్తారని చెప్పేశారు.
ఇలా వైసీపీ ఆనందంగా ఉంటే ఇపుడు ఏపీ బీజేపీ రంగంలోకి దిగింది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ లో ఒక ట్వీట్ దీని మీద వచ్చింది. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇపుడు ఏమంటారు అని ప్రశ్నించింది. తనక్ది అవినీతి రహిత పాలన అని చెప్పుకునే చంద్రబాబు ఈడీ నోటీసులు మీద ఎందుకు స్పందించరు అంటూ బిగ్ క్వశ్చన్ రైజ్ చేసింది. పైగా తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో పని చేసిన అధికారులకు ఈడీ నోటీసులు ఇస్తే బాబు మౌనంగా ఉండనేల అంటూ సెటైర్లూ పేల్చింది.
అంతటితో ఆగలేదు. ఏపీలో టీడీపీ వైసీపీ రెండూ అవినీతి పార్టీలే అని వైసీపీ గాలి కూడా తీసేసింది. అందువల్ల అవినీతి మీద మాట్లాడే హక్కు రెండు పార్టీలకు లేనే లేదని తేల్చి చెప్పేసింది. ఇలా ఒక వైపు బాబు మీద కామెంట్స్ చేస్తూనే మరో వైపు వైసీపీ కూడా చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పేసింది. ఇక మరో వైపు చూస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ జరిగేది ప్రధాని అధ్యక్షతన జీ 20 సన్నాహక సదస్సు. అందరి సలహాల కోసం అఖిల పక్షాన్ని పిలిచారు.
అయితే ఇది రాజకీయం కోసం టీడీపీ ఉపయోగించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ మీటింగ్ ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు మోడీ అపాయింట్మెంట్ తీసుకుని ప్రత్యేకంగా చర్చలు జరుపుతారని ఏపీలో మళ్లీ 2014 పొత్తులకు తెర లేపుతారని వార్తలు ప్రచారంలో ఉన్న టైం లో ఈడీ దాడులు జరగడం దాన్ని ఏపీ బీజేపీ బాబుకు ముడిపెట్టి కామెంట్స్ చేయడం చూస్తే టీడీపీ అతిగా ఊహించుకున్నా ఏమీ ఢిల్లీలో జరగదు అని క్లారిటీగా చెప్పడమే అని అంటున్నారు.
ఇక చంద్రబాబుతో పాటు జగన్ కి కూడా తమ పార్టీ సమాన దూరం పాటిస్తోంది అని తెలియచేయడమే ఈ ట్వీట్ వెనకాల ఉద్దేశ్యం అని అంటున్నారు. మొత్తానికి సరైన టైం చూసి బాబు ఆశల పైన ఢిల్లీ టూర్ మీద కుండెడు నీళ్ళను చిమ్మేసింది ఏపీ కమలం అని అంటున్నారు. మరి ఇంత జరిగినా బాబు మోడీ అపాయింట్మెంట్ సంపాదించి భేటీ వేస్తే కనుక అది అద్భుతమే అవుతుంది అని అంటున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.