మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి ఏపీలోని అధికార.. విపక్ష నేతల మధ్య. గతంలో ఎప్పుడూ లేని రీతిలో అధికార.. విపక్షాల మధ్య రాజకీయ వైరం కాస్తా.. వ్యక్తిగత వైరం స్థాయికి చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పోటాపోటీగా డెవలప్ మెంట్ యాక్టివిటీస్ చేయాలన్న కసి నేతల్లో ఉండేది. అందుకుభిన్నంగా ఇప్పుడు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికి.. రాజకీయ ప్రత్యర్థుల అధిక్యతను దెబ్బ తీయటమే లక్ష్యంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
మారిన రాజకీయాన్ని అధికార వైసీపీ పూర్తిగా వంట పట్టించేసుకున్నట్లుగావిమర్శలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే నిత్యం ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంది. తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారీ విపక్ష టీడీపీ నేతలు అంతే తీవ్రంగా విరుచుకుపడుతున్న వైనంతో ఏపీలో రాజకీయంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఇలాంటి వేళ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 'అఖండ' సినిమాను చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలంతా తమకు శత్రువులు కాదని.. తమ నేతల మీదా.. కార్యకర్తల మీద కేసులు పెట్టటం.. అవమానించటం.. దౌరర్జన్యాలు.. దాడులు చేసిన వారికి టీడీపీ పవర్లోకి వచ్చినంతనే 'అఖండ' సినిమా చూపిస్తామన్నారు.
తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరిని ఒకేలా చూశామని.. అలాంటిది ఇప్పుడు మాత్రం ఏపీలో ఆరాచకం తప్పించి డెవలప్ మెంట్ లేదన్నారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు.. ఊరేగింపులు చేసుకోవాలంటే వైసీపీ నేతల నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. బినామీ పేర్లతో బ్యాంకులు.. సొసైటీల్లోని కోట్లాది రూపాయిల్ని రుణాల్ని తీసుకున్నారన్నారు.
టీడీపీ పవర్లోకి వచ్చిన తర్వాత వీటిపై విచారణ జరిపించి.. అందరినీ జైలుకు పంపుతామన్నారు. యరపతినేని మాటల్ని వింటే.. ఏపీలో మారిన రాజకీయం ఏ రీతిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.