ఏపీలో రాజ్యసభ రేసు మొదలైపోయింది. నాలుగు స్థానాలు త్వరలో ఖాళీ కానుండడంతో వాటికోసం పోటీపడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. దీనికోసం టీడీపీలో ఆశావహుల లిస్టు పెద్దగానే ఉంది. మరోవైపు వైసీసీ నుంచి కూడా వారికి ఛాన్సున్న ఒక సీటు కోసం పోటీ ఉంది. ఇక బీజేపీ నేతలు అయితే టీడీపీ కోటాలో ఒక రాజ్య సభ సీటు ఎగరేసుకుపోవాలని ట్రై చేస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణాలన్నీ ఇలా ఉండగా.... మీడియా అధినేతల ప్లాన్లు ఇంకోలా ఉన్నాయి. రాజ్యసభకు వెళ్లేందుకు రాజకీయ పార్టీల మార్గమైతే తమకు అవకాశం రాదన్న ఉద్దేశంతో ఏకంగా రాష్ట్రపతి కోటాలో వెళ్లేందుకు మార్గం సుగమం చేసకుంటున్నారు.
తెలుగులో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేత రాజ్యసభ సభ్యత్వం ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయనున్నట్లు సమాచారం. జర్నలిజంలో చేస్తున్న విశిష్ఠ సేవలకు గుర్తింపుగా, ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో సేవలందిస్తోన్న వారిని రాజ్యసభకు నామినేట్ చేయటం ఒక ఆచారంగా వస్తోన్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మీడియా ఛానల్ అధినేత మీడియాతో పాటు ట్రావెల్సు రంగంలోనూ ఉన్నారు. రాజకీయంగా మంచి సంబంధాలున్న ఆయన్ను రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయడం ఖాయమని టాక్.