మందులపై ఇక తెలుగు పేర్లు .. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

Update: 2020-07-14 08:30 GMT
సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం తెచ్చుకునే మందు డబ్బాలపై ఇంగ్లీష్ లో పేర్లు ఉంటాయి. ఆలా ఇంగ్లీష్ లో    పేర్లు ఉండడంతో ఏ జబ్బు కి ఏ మందు వేసుకోవాలని అర్ధం చేసుకోవడం సామాన్యులకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో  సామాన్యులకు మందుల పై అవగాహన పెంచేందుకై తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఓ సంచలన  నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై తెలుగులో  లోనూ ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది.

వేసుకునే మందుల పేర్లు తెలియడంతో పాటు సులువుగా చదువుకోవడం, ఏ మందు ఎందుకు ఉపయోగపడుతుందో కూడా సామాన్యులకు తెలిసేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యాధికారులు తెలిపారు.  తెలంగాణ ఆరోగ్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News