తెలుగు ప్రాంతానికి సంబంధించినంత వరకూ గతంలో ఒక దిగులు ఉండేది. తమిళుల ప్రయోజనాల కోసం తమిళ నేతలు ఎంతవరకైనా సరే సై అంటారని అదే రీతిలో కన్నడ.. మాలయాళీలు సైతం మొదట తమ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే మిగిలిన ముచ్చట్ల మీద ఫోకస్ చేసే వారన్న పేరుంది. అయితే.. ఈ తీరులో తెలుగు నేతల విషయంలో మాత్రం అందరూ వేలెత్తి చూపించేవారు. తెలుగు నేతలకు తెలుగు ప్రజల ప్రయోజనాలు.. తెలుగోళ్ల బాగోగుల మీద పెద్ద ఫోకస్ ఉండదన్న అభిప్రాయం ఉంది.
అది తప్పు అన్న భావన కలిగేలా చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. విభజన అనంతరం తెలుగు రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సంగతి గతంలో మాదిరే ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయం పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రయోజనాలకు పెద్ద పీట వేయటం.. దాని తర్వాతే ఇంకేదైనా అన్నట్లుగా తెలంగాణ అధికారపక్షం వ్యవహరిస్తూ.. తెలంగాణ ప్రజలకు సరికొత్త భరోసాను ఇచ్చేస్తోంది.
ప్రపంచంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నా.. వారికి ఏదైనా అయితే తానున్నానంటూ ముందుకు వచ్చేస్తుంటారు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా చోటు చేసుకున్న పరిణామం నేపథ్యంలో కేసీఆర్ చొరవ ఇప్పుడు అవసరమైంది. లక్షలాది తెలంగాణ ప్రజలు సౌదీలో నివసిస్తుంటారు. బతుకుదెరువు కోసం పెద్ద ఎత్తున సౌదీకి వెళ్లిన వారిపై అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది.
సౌదీలో విదేశీయులు ఎవరైనా సరే.. వచ్చే నెల (జులై) ఒకటో తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ 100 సౌదీ రియాళ్లు (మన రూపాయిల్లో రూ.1721) చొప్పున చెల్లించాలంటూ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. తర్వాత నుంచి ఈ పన్ను బాదుడు అంతకంతకూ ఎక్కువ కానుంది. తాజా పన్ను సౌదీలో నివసించే లక్షలాది తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాజాగా విధించిన ఈ కుటుంబ పన్ను శరాఘాతంగా మారిందన్న వేదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి.. తెలంగాణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఇబ్బందికరంగా మారిన ఈ ఇష్యూ మీద ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/