తెలుగు స్మార్ట్ సిటీల సంగతులు తెలుసా..?

Update: 2015-09-05 13:02 GMT
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయనగరాల(స్మార్ట్ సిటీ) ప్రాజెక్టులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ - తెలంగాణల్లోని నగరాలను కూడా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం -  కాకినాడ - తిరుపతి...తెలంగాణ లో హైదరాబాద్ - వరంగల్ నగరాలను స్మార్టు సిటీలు అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఈ నగరాలు ఇప్పటికే బహుళ ప్రజాదరణ పొందినవి కావడం విశేషం. పర్యాటకం గా,చారిత్రకం గా ప్రసిద్ధిగాంచిన ఈ నగరాలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. స్మార్టు సిటీలు గా ఎంపికకావడం తో వీటి రూపురేఖలు మరింత గా మారుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీలు

విశాఖపట్నం

             నవ్యాంధ్రప్రదేశ్ అతి పెద్ద నగరం విశాఖపట్నమే. ఒకప్పుడు మత్స్య కారు లే అధికం గా ఉన్న ఈ పట్టణం నగరంగా అవతరించాక దేశంలో ని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆవాసంగా మారింది. ఇక్కడి పరిశ్రమలు.... ఓడరేవు ఆధారంగా జరిగే వేలకోట్ల రూపాయల వ్యాపారం కారణం గా ఈ నగరం రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా ఉంది. పురావస్తు శాస్త్రజ్ఙలు లెక్కల ప్రకారం విశాఖపట్నం11వ శతాబ్దం లోనే నిర్మితమైంది. 15వ శతాబ్దం లోఈ ప్రాంత మంతా విజయనగర సామ్రాజ్యం పరిధి లోకి వెళ్లడానికి ముందు వరకు విశాఖపట్నం చోళ రాజులు, అనంతరం గజపతిరాజుల పాలనలో ఉండేది. 16వ శతాబ్దంలో మొఘలులు.. 18వ శతాబ్దం నుంచి ఫ్రెంచివారు దీన్ని పాలించారు. 1804 లో బ్రిటిషర్ల పాలనలో కి వచ్చింది. 1930-40 ప్రాంతాల వరకు దీన్ని వైజాగ్ పట్నంగా పిలిచేవారని.. అనంతర కాలం లో విశాఖపట్నం గా మారిందని చెబుతుంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విశాఖపట్నం దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటిగా శరవేగంగా అభివృద్ధి చెందింది. తూర్పు నౌకాదళాని కి ప్రధాన కేంద్రంగా.... దక్షిణ భారతదేశం లో ముఖ్య పర్యాటక ప్రాంతం గానూవిశాఖ విలసిల్లుతోంది.

            విశాఖపట్నం తో ఓడ రేవుతో పాటు పలు ముఖ్యమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలున్నాయి. విశాఖ ఉక్కుగా పిలుచుకునే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ ఐఎన్ఎల్).. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్, షిప్ యార్డ్.. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటివి ఇక్కడున్నాయి. ఐటీ రంగం లోనూ విశాఖనగరం దూసుకెళ్తోంది.

కాకినాడ

నవ్యాంధ్రలోని ముఖ్యమైన తీరప్రాంత నగరమిది...చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతకు ఇది ముఖ్య కేంద్రం. రిలయన్స్, ఓఎన్జీసీ వంటివి ఇక్కడి కేంద్రంగా బంగాళఖాతం లోఆయిల్, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలు చేపడుతున్నాయి.1996లో ఇక్కడ ప్రయివేటు రంగంలో డీప్ వాటర్ పోర్టు ఏర్పాటయింది. పెట్రోలియం, రసాయనాలు, పెట్రో రసాయనాల పెట్టుబడుల కారిడార్(పీసీపీఐఆర్)లో కాకినాడ భాగంగా ఉంది.కాకినాడ సమీపంలో పలు గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలున్నాయి. ప్రణాళికా బద్ధమైన నగరంగా కాకినాడకు పేరుంది.

తిరుపతి

వైష్ణవానికి ముఖ్యకేంద్రం గా ఉంటూ అయిదో శతాబ్దంలో తిరుపతి నగరం ఏర్పడింది. 1886లోనే బ్రిటిషర్ల హయాంలో తిరుపతి మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇక్కడి ప్రఖ్యాత వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంగతితెలిసిందే. వివిధ రాజుల పాలనలో ఈ ఆలయం దినదినప్రవర్థమానంగా ఎదిగింది. తిరుమల వెంకన్న ఆలయానికిఏడాదికి సుమారు రెండు కోట్ల మంది భక్తులు వస్తుంటారు. చెన్నై,బెంగళూరు మెట్రోనగరాలకు ఇది సమీపంలో ఉంది.  ఆలయపర్యాటకానికి పేరుగాంచిన నగరమిది.. ఇక్కడి ఆదాయంప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధారంగానేఉంటుంది. తిరుపతిలో 750 పడకల రుయా ఆసుపత్రి ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలోనే అతిపెద్ద ఆసుపత్రి కావడం విశేషం.

తెలంగాణలోని స్మార్ట్ సిటీలు
హైదరాబాద్..

హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమాహారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని గా ఈ నగరం ఎంతగానో అభివృద్ధి చెంది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1591లో మహ్మద్ కులీ కుతుబ్షా నిర్మించిన హైదరాబాద్ నగరం కుతుబ్ షాహీల పాలనలోఉండేది. అనంతరం 1724లో మొఘలుల పాలనలోకి వచ్చింది.మొఘలులకు వైస్రాయ్ గా ఉన్న అసిఫ్ జాహీ స్యయం ప్రతిపత్రి ప్రకటించుకున్నాడు... దాన్నే నిజాం సామ్రాజ్యంగా పిలవడం ప్రారంభించారు.

1990 వరకు సాధారణంగానే ఉన్న ఈ నగరం అనంతరం ప్రగతి పరుగులు తీసింది. హైదరాబాద్ లో ముత్యాలు, బిర్యానీ ప్రసిద్ధి పొందాయి. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉన్న హైదరాబాద్ 2014 జూన్ లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాలకు ప్రస్తుతం రాజధాని గానే ఉంది.

వరంగల్

12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు కాకతీయుల సామ్రాజ్యాని కి రాజధాని గా ఉన్న వరంగల్ తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం. ఓరుగల్లు, ఏకశిలానగరం అనేవి దీనికి ఒకప్పటి పేర్లు. తెలంగాణ ప్రాంతాని కి వరంగల్ సాంస్క్రుతి క రాజధాని అని చెబుతుంటారు. వరంగల్ నగరం చారిత్రక కట్టడాలకు పేరొందింది. ఇక్కడి వేయి స్తంభాల గుడికి ఎంతో పేరుంది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలను కలిపి ట్రై సిటీస్ అంటారు. 2014 లో గ్రేటర్ వరంగల్ ఏర్పడింది.  హైదరాబాద్ కు ఇది 145 కిలోమీటర్ల దూరంలో  ఉంది.
Tags:    

Similar News