కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో దుర్మరణం చెందారు. అమెరికాలోని పీట్స్ బర్గ్ లో నివాసం ఉంటున్న వల్లభనేని హరీశ్ (42) ప్రమాదవశాత్తు తన కారు కిందే పడి దుర్మరణం చెందారు. కారును ఆన్ లో ఉంచి రిపేరు చేస్తుండగా అది ముందుకు దూసుకురావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పిట్స్‌బర్గ్‌లోని తన నివాసం ముందే సోమవారం ఈ ఘటన జరిగింది. అయితే హరీష్ తల్లిదండ్రులకు అతడి మృతి గురించిన సమాచారం మాత్రం బుధవారం సాయంత్రం దాటిన తర్వాత తెలిసింది.
పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి నుంచి అమెరికా వెళ్లిన హరీశ్ పిట్స్ బర్గ్ లోని ప్రముఖ కంపెనీలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కారు కాస్త ట్రబుల్ ఇస్తుందని గ్రహించి ఇంజన్‌ను ఆన్ లోనే ఉంచి బానెట్ తెరిచి మరమ్మతులు చేస్తున్నారట. సరిగ్గా అదే సమయంలో కారు ముందుకు దూసుకొచ్చేయడంతో కారు ముందు భాగంలో ఉన్న హరీశ్ కిందపడిపోగా ముందు టైర్ ఆతని ఛాతిపైకి ఎక్కేసింది. దీంతో హరీశ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
కాగా, హరీశ్ కు భార్య - ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కూడా అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ముదినేపల్లిలోని హరీష్ తల్లిదండ్రులు వల్లభనేని దాసు - ఝాన్సీ అతడి మరణవార్త వినగానే విషాదంతో కుంగిపోయారు. శుక్రవారం సాయంత్రానికి మృతదేహాన్ని రాష్ట్రానికి తీసుకురానున్నారు. ముదినేపల్లిలోని హరీష్ ఇంటివద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/