అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే ‘భారతదేశ ప్రాంతీయభాషలు’లో తెలుగు మూడో స్థానంలో నిలిచింది. ‘‘యూఎస్ సెన్సస్ బ్యూరో’ నిర్వహించిన ‘‘అమెరికా కమ్యూనిటీ సర్వే’’ ఈ విషయం వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం గుజరాతీ మొదటి స్థానంలో - మరాఠీ రెండో స్థానంలో ఉన్నాయి. మొత్తంగా భారతీయ భాషలను తీసుకుంటే హిందీ మొదటి స్థానంలో - ఉర్దూ రెండో స్థానంలో - గుజరాతీ మూడో - మరాఠీ నాలుగో - తెలుగు అయిదో స్థానంలో ఉన్నాయి.
భారతదేశానికి చెందిన ప్రాంతీయ భాషలనే లెక్కలోకి తీసుకుంటే గుజరాతీ - మరాఠీ - తెలుగు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2012-16 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుని 2016లో జరిపిన ఈ సర్వే ఫలితాలను సెప్టెంబరు నెలలో విడుదల చేశారు. దాని ప్రకారం అమెరికాలో 3,21,695 మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్లు తేలింది. మన ప్రాంతీయ భాషల్లో తెలుగు తరువాత పంజాబీ మాట్లాడేవారు 2,80,867 మంది - బెంగాలీ మాట్లాడేవారు 2,59,204 మంది - తమిళం మాట్లాడేవారు 2,38,699 మంది ఉన్నారు. ప్రాంతీయ భాషల్లో మొదటి స్థానంలో ఉన్న గుజరాతీని అక్కడ 4 లక్షల మంది.. మరాఠీని 3.6 లక్షల మంది మాట్లాడుతున్నారు.
ఆ దేశంలో తెలుగు మాట్లాడేవారిలో అత్యధికులు కాలిఫోర్నియా - టెక్సాస్ - న్యూజెర్సీలలోనే ఉన్నారట. పంజాబీ మాట్లాడే వారిలో 48 శాతం మంది కాలిఫోర్నియాలో - బెంగాలీ మాట్లాడే వారిలో 38.6 శాతం మంది న్యూయార్క్‌లో ఉన్నారు. కాగా 2012-16 మధ్య కాలంలో ఇంగ్లీషేతర భాషలు మాట్లాడే వారి సంఖ్య 21.1 శాతం పెరిగింది. 2007-11 మధ్య నమోదైన 20.3 శాతం వృద్ధికన్నా ఇది అధికం.
మరోవైపు అమెరికా ప్రభుత్వంలో కూడా భారతీయుల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పంజాబీ మూలాలున్న వ్యక్తి. మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగువారు. అడోబ్ సీఈవో శంతను నారాయెన్ హైదరాబాద్‌వాసి. ఆయన ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. హాస్యనటుడు అజీజ్ అన్సారీ తల్లిదండ్రులు మాతృభాష తమిళం. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా తమిళనాడులో పెరిగినవ్యక్తే.
యూఎస్‌లో ఇంగ్లీష్, స్పానిష్ తరువాత అత్యధికులు మాట్లాడే భాషలు
* చైనీస్... 31.7 లక్షలు
* టాగలాగ్(ఫిలిప్పీన్స్)... 16.8 లక్షలు
* వియత్నామీస్... 14.5 లక్షలు
* ఫ్రెంచి.. 12.2 లక్షలు
* కొరియన్.. 11 లక్షల మంది..
* అరబిక్... 10.9 లక్షలు
* జర్మన్.. 9.6 లక్షలు
* రష్యన్.. 9 లక్షలు
* హైతీ.. 8.1 లక్షలు
***** హిందీ... 7.4 లక్షలు*****
* పోర్చుగీస్.. 7 లక్షలు
* పోలిష్... 5.4 లక్షలు
* యిద్దిస్.. 4.8 లక్షలు
* అమ్హారిక్ అండ్ సోమాలి.. 4.7 లక్షలు
* జపనీస్... 4.5 లక్షలు
****** ఉర్దూ 4.5 లక్షలు******
* హవాయియన్.. 4.4 లక్షలు
* పర్షియన్.. 4.1 లక్షలు
****** గుజరాతీ.. 4 లక్షలు****
* నేపాలీ.. 3.6 లక్షలు
***** మరాఠీ.. 3.6 లక్షలు****
****** తెలుగు... 3.2 లక్షలు*****