గతానికి భిన్నంగా మోడీ సర్కారు కేంద్రంలో కొలువు తీరిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పద్మ పురస్కారాల ఎంపికలో గతానికి ఇప్పటికి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వాల్లో సిఫార్సులు.. లాబీయింగ్ తో పద్మ పురస్కారాలకు బాటలు పడేవన్న అపవాదు ఉండేది. ఇదేమీ కాకుంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన వారికి పెద్దపీట వేయటం ఉండేదన్న ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. అలా అని ఇప్పటికే ఎంపికైన వారిని తక్కువ చేయటం.. చులకన చేయటం ఇక్కడ ఉద్దేశం కాదు. వ్యక్తిగతంగా ప్రతిభ ఉన్నప్పటికీ మరెందరికో లభించని అవకాశం.. కొందరికి మాత్రమే లభించేదన్న మాట వినిపిస్తోంది.
అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం కొలువు తీరిన ఏడేళ్ల కాలంలో.. ఇప్పటివరకు ప్రచారంలోకి రాని వారిని.. తాము సేవ చేసే ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావటం తప్పించి.. జాతీయ.. రాష్ట్ర మీడియాలో పెద్దగా ఫోకస్ కాని వారెందరో పద్మ పురస్కారాల్ని సొంతం చేసుకున్న పరిస్థితి. తాజాగా మరోసారి పద్మ పురస్కారాలకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2022 ఏడాదికి పద్మ అవార్డులకు నామినేషన్లు.. సిఫార్సుల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.
ప్రతి ఏడాది జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మవిభూషణ్.. పద్మభూషణ్.. పద్మశ్రీ అవార్డులను అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఈ అప్లికేషన్లను స్వీకరించేందుకు తుది గడువును సెప్టెంబరు 15గా డిసైడ్ చేశారు. ఈ లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కోరింది. పద్మ అవార్డుల్ని ప్రజల పద్మగా మార్చటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొనటం ద్వారా.. గత ప్రభుత్వాలకు తమ ప్రభుత్వాలకు మధ్యనున్న తేడాను చెప్పకనే చెప్పేశారు.
మహిళలు.. ఎస్సీ.. ఎస్టీలు.. దివ్యాంగులు.. సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిని గుర్తించి సిఫార్సు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆసక్తి.. అర్హత కలిగిన వారు వచ్చే నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డుల్ని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల్లో విశేష సేవలు చేస్తున్న వారిని గుర్తించి..వారి తరఫున పద్మ పురస్కారాలకు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది. అలా అయినా జాతీయస్థాయిలో తెలుగు వారికి గుర్తింపు పొందే వీలుంటుంది. మరి.. తెలుగు సీఎంలు ఆ పని చేస్తారా?