దేశంలో మాంసాహార వినియోగం బాగా పెరిగిందని సర్వేలో తేలింది. ముక్కలేనేది ముద్దదిగని వారు చాలా మందే ఉన్నారు. కొందరు ఆదివారాలు ఫుల్లుగా మాంసాన్ని తెచ్చుకొని లాగేస్తే.. ఇంకొందరు ఇతర వారాల్లో కూడా మాంసాహారాన్ని తీసుకుంటున్నారు.
కరోనాకు చెక్ పెట్టాలంటే మాంసాహారం తినాలని వైద్యులు సూచించడంతో అప్పటి నుంచి వీటి వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా చికెన్, మటన్ సెంటర్ల వద్ద ప్రజలు సందడి చేస్తూనే ఉన్నారు. రేటు ఎంతైనా సరే వారానికి ఒకసారైనా మాంసం రుచి చూడాలనుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు.
తాజాగా ఎన్ఎఫ్.హెచ్.ఎస్5 సర్వేలో భాగంగా మాంసాహారం తినేవారిపై సర్వే నిర్వహించారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మొత్తంగా 77మంది మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా చికెన్, మటన్, ఫిష్ మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దేశ సగటు కంటే చాలా ఎక్కువగా తెలంగాణలో 96శాతం, ఏపీలో 96 శాతం మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తేలింది.
అత్యధికంగా లక్షద్వీప్ లో 100శాతం మంది మాంసాన్ని తింటుండగా.. అతి తక్కువగా రాజస్థాన్ లో కేవలం 31శాతం మంది మాత్రమే మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశంతో గత సర్వేతో పోలిస్తే ఈ సారి మాంసం ఆహారం తీసుకునే వారి సంఖ్య బాగా పెరగడం విశేషం.