నీట్...ఇటీవలి కాలంలో కేవలం విద్యార్థులనే కాకుండా విద్యావేత్తలను - రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. పొరుగు రాష్ర్టాల్లో కంటే తెలుగు విద్యార్థులకు మరో షాక్ తగిలింది. ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయడం - తెలుగు మీడియంలో పరీక్ష రాసేందుకు ప్రయత్నం చేయకపోవడంతో మనోళ్లకు నీట్ షాక్ తగిలిందని విద్యావేత్తలు అంటున్నారు. 50 వేల మంది విద్యార్థులు నీట్ రాయగా ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులను నీట్ కు తగ్గట్టుగా సిద్ధం చేయలేకపోవడం, ఇంగ్లిష్ లో ప్రశ్నప్రతం కఠినంగా రావడం, రాష్ట్రం నుంచి పరీక్ష రాసినవారిలో 95 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో రాసి కేవలం ఐదు శాతం మాత్రమే తెలుగు మాధ్యమంలో రాయడంతో తమ కలల కోర్సులో విద్యార్థులకు అడ్మిషన్లు దక్కే చాన్స్ పోయిందని విశ్లేషిస్తున్నారు.
విద్యార్థుల్లో బాగా క్రేజ్ ఉన్న వైద్య ప్రవేశాలకు నీట్ తప్పనిసరి చేయడంతో గత ఏడాది నుంచి ఎంసెట్ బదులుగా ఈ పరీక్షకు విద్యార్థులు తప్పక హజరుకావాల్సి వచ్చింది. అయితే జాతీయ స్థాయి పోటీకి తగిన తగిన విధంగా మన పాఠ్యాంశాల రూపకల్పన లేకపోవడం సమస్యగా మారింది. తెలంగాణలో అయితే పూర్తిస్థాయిలో సిలబస్ ను తీర్చిదిద్దకుండానే నీట్ పరీక్షకు విద్యార్థులు హాజరు కావాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులకు సమస్య వచ్చిపడింది. దీంతో పాటుగా పలు రాష్ర్టాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నీట్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రథమ సంవత్సరంలో విద్యార్థులను తీర్చిదిద్దుతారు. రెండో ఏడాది మాత్రమే ఇంటర్ పరీక్షకు తగినట్లుగా సన్నద్ధత కల్పిస్తారు. తద్వారా విద్యార్థులకు నీట్ ను ధైర్యంగా ఢీకొనే పరిజ్ఞానం దక్కుతుంది. ఇంతేకాకుండా నెగెటివ్ మార్కులు ఉండటం సైతం విద్యార్థుల స్కోరుకు దెబ్చేసింది. తెలుగు విద్యార్థులు మెజార్టీ ఇంగ్లీష్ లోనే రాయడం వల్ల కూడా విద్యార్థులకు నష్టం అయిందని అంటున్నారు. తెలుగులో పరీక్షా పత్రం సులభంగా వచ్చిందని, ఇంగ్లిస్ లోనే కఠినంగా ఉండటం కూడా విద్యార్థులకు నష్టం చేసిందని అంటున్నారు.
తెలంగాణ నుంచి పరీక్ష రాసిన విద్యార్థులకు నష్టం చేకూర్చిన మరో అంశం నేషనల్ పూల్ లో ఈ రాష్ర్టానికి సభ్యత్వం లేకపోవడం. ఈ సభ్యత్వం పొందడం ద్వారా జాతీయ స్థాయిలోని ఎంబీబీఎస్ సీట్లలో 15శాతం - పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం సీట్లు పొందే చాన్స్ ఉంటుంది. ఈ పూల్ లో చేరడం కోసం అవసరమైన రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇంటర్ విద్యలో సంస్కరణలు చేయకుండా చేరితే నష్టమే తప్ప లాభం ఉండదని పలువురు విద్యావేత్తలు వివరిస్తున్నారు. మరోవైపు నేషనల్ పూల్ లో చేరకపోయిన నష్టం ఏమీ లేదని అంటున్నారు. మన రాష్ట్రంలోని సీట్లను మన విద్యార్థులకే దక్కుతాయని విశ్లేషిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/