చదువు కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ప్రవీణ్ గల్లా అనే తెలుగు విద్యార్థి కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ లో శవమై కనిపించాడు. కాల్ స్టేట్ ఫులెర్టన్ యూనివర్శిటీలో చదువుకుంటున్న 23 ఏళ్ల ప్రవీణ్.. ఈ నెల ఒకటో తారీఖు నుంచి కనిపించడం లేదు. రెండో తారీఖున అతడి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారం పైగా గాలించి చివరికి న్యూపోర్ట్ బీచ్ లో ప్రవీణ్ మృతదేశాన్ని కనుగొన్నారు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ప్రవీణ్ న్యూపోర్ట్ బీచ్ దగ్గర్లో ఉన్నట్లు తేలింది. తీరానికి వెయ్యి అడుగుల దూరంలో సెల్ ఫోన్ సిగ్నళ్లు వస్తుండటంతో అక్కడికి వెళ్లి చూడగా ప్రవీణ్ శవమై కనిపించాడు.
ఫిబ్రవరి 1న ప్రవీణ్ తన యూనివర్శిటీ క్యాంపస్ దగ్గర ఉబెర్ క్యాబ్ ఎక్కినట్లు విచారణలో వెల్లడైంది. అతణ్ని వెస్ట్ క్యాంపస్ దగ్గర డ్రాప్ చేసినట్లు క్యాబ్ డ్రైవర్ చెబుతున్నాడు. కానీ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా అలాంటిదేమీ లేదని తేలింది. మరి ప్రవీణ్ ను ఎవరైనా హత్య చేశారా లేక.. బీచ్ లో ప్రమాద వశాత్తూ అతను ప్రాణాలు కోల్పోయాడా అన్నది మిస్టరీగా మారింది. ఏదేమైనా కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన కొడుకు అక్కడ శవమై తేలి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.