హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ఒకరు అమెరికాలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని రామంతపూర్ ప్రాంతానికి చెందిన శివకిరణ్ అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు. అయితే... ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థుల విషయంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు చూపిస్తున్న వివక్ష కారణంగా ఆయన ఆందోళనకు గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుమారు 6 వేల మందిని వెనక్కు పంపడం తెలిసిందే.
చదువుకోవడానికి అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థులు అక్కడ చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. సంపాదన కోసం ఇబ్బందులు... పైగా అక్కడి కొన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతులు లేకున్నా విద్యార్థులను చేర్చుకోవడం వంటి అంశాలతో ఆయన తన విద్యాభ్యాసంపైనా ఆందోళనకు గురయినట్లు సహచర విద్యార్థులు చెప్తున్నారు. ఇటీవల ఇమిగ్రేషన్ అధికారులు స్టూడెంట్లను విమానాశ్రయం నుంచే తిప్పి పంపించడం వంటి సంఘటనలు... వారిని అరెస్టు చేయడం వంటివి చూసి శివకిరణ్ బాగా ఆందోళనకు గురయ్యాడట. పైగా చదువులోనూ రాణించలేకపోతున్నానని ఆయన మనో వ్యధకు గురయినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.