అగ్రరాజ్యం అమెరికాలో మన తెలుగు వాళ్లు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ర్టాలతో సహా తెలుగు బిడ్డలు అమెరికాలో మెజార్టీ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా మనవాళ్లందరి లెక్క కొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలో జరిగిన ఓ సర్వేలో మొత్తం భారతీయుల్లో మూడో వంతు తెలుగు భాష మాట్లాడే వారున్నారని తేలింది. అయితే దీనిపై తెలుగువారిలో అసంతృప్తి ఉందట. ఎందుకంటే ఈ సర్వేలో తేలిన దానికంటే ఎక్కువ శాతం మన వాళ్లున్నారని అంటున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే...అమెరికా కమ్యూనిటీ సర్వే ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయుల్లో హిందీ, గుజరాతీ మాట్లాడే వారు ఒకటి రెండో స్థానాల్లో ఉండగా...తెలుగు భాష మాట్లాడే వారు మూడో స్థానంలో ఉన్నారు. 2016లో జరిగిన ఈ సర్వే ఫలితాలను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేశారు. మన భాష తర్వాతి స్థానంలో బెంగాళీ మరియు తమిళం ఉంది. ఈ అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో ఐదేళ్ల వయసు పైబడిన వారు 3,65,566 మంది తెలుగు మాట్లాడుతున్నారు. అమెరికా జనాభాలోని ఐదేళ్ల పైబడిన వారిలో ఇది 0.12%. ఈ సర్వే ప్రకారం అమెరికాలో మాట్లాడే 20 ప్రముఖ భాషల్లో తెలుగు ఒకటి. భారతీయ భాషలను మాట్లాడే వారి సంఖ్య మొత్తం 35,51,455 కాగా తెలుగు వారి సంఖ్య 3,65,566. అయితే దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలో తేలినవి నిజమైన వివరాలు కావంటున్నారు. పలువురు తమ భాష వివరాలను సరిగా వ్యక్తం చేయడం సహా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా ఈ అంకెల్లో వాస్తవికత తక్కువగా ఉందని చెప్తున్నారు.
2001 నుంచి లెక్కలను గమనిస్తే, అమెరికా ఇస్తున్న మొత్తం హెచ్1బీ వీసాల్లో 50 శాతం తెలుగువారికే దక్కుతున్నాయి. అంటే అమెరికాలో నివసిస్తున్న వారిని, వారి కుటుంబాలు కూడా కలుపుకొని లెక్కేస్తే దాదాపు ఒక మిలియన్ జనాభా ఉంటారు``అని ఓ తెలుగు వ్యక్తి వెల్లడించారు. ఈ సర్వే వాస్తవ గణాంకాలను ప్రతిబింబించలేదని చెప్పుకొచ్చారు.