మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు వెలుగు

Update: 2019-10-02 09:40 GMT
వారు మహారాష్ట్ర పులులు.. తమ మరాఠీ తప్ప ఇతర భాషలను అస్సలు ఒప్పుకోరు. వేరే రాష్ట్రాల వారిని ముంబై నుంచి తరిమికొట్టిన చరిత్ర వారిదీ.. కానీ ఎన్నికల టైం వచ్చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ‘శివసేన’పులులు తోక ఆడిస్తూ ఇతర భాష ప్రాంతాల ప్రజలు ఉన్న చోట ఓట్ల కోసం కొత్త ఎత్తులు వేస్తున్నాయి..

తాజాగా మహారాష్ట్ర ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయి. దీనికోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.  ఈ ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా పోటీచేస్తున్నారు. శివసేన యువసేన అధ్యక్షుడు అయిన ఈయన వర్లీ నుంచి పోటీపడుతున్నారు.

అయితే మరాఠీల కోసం పాటుపడే శివసేన తరుఫున నిలబడ్డ ఆదిత్య థాక్రే తాజాగా తను పోటీచేస్తున్న వర్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఆదిత్య థాక్రే వర్లీ నియోజకవర్గంలో ప్రాంతీయ భాషల్లో ‘‘వర్లీ ప్రజలకు నమస్తే.. తనకే ఓటేయాలంటూ’’ కోరే ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగులో కూడా ఈ పోస్టర్లు ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇలా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రాంతీయ వాదం పక్కనపెట్టి శివసేన పార్టీ ప్రాంతీయ భాషల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి.

    
    
    

Tags:    

Similar News