రాఖీపండుగ రోజే దారుణం చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో మన ఆడబిడ్డ కన్నుమూసింది. చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లావాసి ఉదత్త స్వర్ణ మృతి చెందారు. కూసుమంచికి చెందిన వ్యాపారి కూరపాటి రఘునాథరావు రెండో కుమార్తె స్వర్ణ (32) అమెరికాలోని చికాగోలో ఉంటున్నారు. ఆదివారం భర్త కిరణ్‌కుమార్, కూతురు బిందుతో కలిసి కారులో సినిమాకు వెళ్లి వస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరోకారు వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన స్వర్ణ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. భర్త - కూతురుకు తీవ్రగాయాలయ్యాయి.
ఆదివారం మధ్యాహ్నం వీరు నలుగురూ సినిమాకి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందింది. కిరణ్ కుమార్ - పిల్లలిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. స్వర్ణ మృతిచెందినట్టు కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా కిరణ్ తెలియజేశారు. `రాఖీ పండగకు దగ్గర లేకపోవడం బాధగా ఉంది.. ఐ మిస్ యూ రా..’ అంటూ ఒక్కగానొక్క సోదరుడికి మెసేజ్ పెట్టిన ఆమె కొద్దిక్షణానికే ఇలా విగత జీవిగా మారడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. సోదరుడు సందీప్‌కు ఆన్ లైన్ లో రాఖీలు పంపిన స్వర్ణ.. తాను అందుబాటులో లేకపోవడం బాధగా ఉందంటూ ఆదివారం ఉదయం ‘ఐ మిస్ యూ రా..’ అంటూ మెసేజ్ పెట్టిందని చెబుతూ కుటుంబసభ్యులు రోదించారు.