"మీడియాతో మాట్లాడాలంటే శోభారాణి అవసరం. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు ఇతర నాయకులను తిట్టాలంటే నేనుకావాలి"
" చంద్రబాబు నాయుడు మేలు చేస్తారనే - ఆయన తన వెంటే ఉన్నారనే నమ్మకంతో పని చేశా. కానీ, ఆ నమ్మకం నేటితో పూర్తిగా పోయింది"
ఈ మాటలన్నది తెలుగుదేశం నాయకురాలు శోభారాణి. గడచిన పదిహేను సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పని చేసిన తనను తెలుగుదేశం పార్టీ తనను మోసం చేసిందని శోభారాణి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన శోభారాణి గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. భంగపడ్డారు. అంతకు ముందు 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి టిక్కట్ ఆశించారు. అప్పుడూ అవకాశం దక్కలేదు. ఇప్పుడు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిక్కట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడూ నిరాశ ఎదురైంది. దీంతో ఆమె వేదనను బహిరంగ పరిచారు శోభారాణి.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో శోభరాణి గడచిన రెండు దశాబ్దాలుగా చురుకైన పాత్రను పోషించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరాకు అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గున్నారు. ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పైన - తెలుగుదేశం పార్టీ ప్రయోగించిన ఆయుధంగా శోభరాణికి పార్టీలో గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు సంధర్బంగా ఆలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని - అక్కడ నుంచి తాను పోటి చేయడం ఖాయమని శోభరాణి ఆశించారు. అయితే ఆమె ఆశాలు అడియాశలయ్యాయి. పొత్తులో భాగంగా ఆలేరు నియోజకవర్గం టిక్కెట్టు కాంగ్రెస్ కు దక్కింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బూడిద భిక్షమయ్య గౌడ్ పోటి చేస్తున్నారు. దీంతో శోభరాణి పరిస్దితి అగమ్యగోచరంగా మారింది. తనకు టిక్కెట్టు దక్కకపోవడం పై శోభరాణి తీవ్ర అసంత్రుప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను కూరలో కర్వేపాకుల వాడుకున్నారని తాను ఎన్నిసార్లు చంద్రబాబును కలసిన టిక్కెట్లు నీదే అంటూ హామీ ఇచ్చారని - అయితే చివరి క్షణంలో మాత్రం ఆలేరు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టారని - శోభరాణి కన్నీటి సాక్షిగా విలేఖరుల ముందు వాపోయారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఇలాంటి టిక్కెట్లు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మహాకూటమిలోనే ఇలాంటి నాయకులు ఉండడం గమనార్హం.