ప్రపంచం పొగలు కక్కుతోంది

Update: 2016-05-01 17:30 GMT
భూతాపం విషయంలో ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే కొద్ది నెలల కిందట పారిస్ లో వాతావరణ సదస్సు నిర్వహించి ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందానికి కూడా వచ్చాయి. కాలుష్యం కారణంగా వాతావరణమార్పులు సంభవించి వేడి పెరుగుతోందని.. భూమిపై వేడి దారుణంగా పెరుగుతోందని... ఇది భవిష్యత్తులో మంచు కరిగి భూమి పూర్తిగా నీట మునిగేలా చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ ఏడాది తల పగిలిపోయేలాంటి ఎండలను చూస్తున్నాం. ఒక్క ఇండియాలోనే కాదట ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో భూమి సగటు వేడి ఏకంగా 1.22 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిందంటే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సెగ ఎలా రేగుతుందో... ఎప్పటినుంచి మొదలైందో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

-  135 సంవత్సరాల కిందట 1880మార్చిలో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతల పెరుగుదల నమోదైంది. మళ్లీ 1635మాసాల తర్వాత ఒకే నెల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతల పెరగుదల ఈ నెలలోనే నమోదైంది.

- గతనెల ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణో గ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఆస్ట్రేలియాలో 107సంవత్సరాల రికార్డుల్ని బద్దలుకొట్టి మార్చి 2016లో 1.70డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

- న్యూజిలాండ్‌ లో 1909తర్వాత ఈ మార్చి నెలలోనే 1.30డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

- బహరైన్‌ లో మార్చిలో నమోదైన ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జాబితాలో ఐదోదిగా చరిత్ర కెక్కాయి.

- డెన్మార్కులోనూ మార్చిలో 1.7డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

- స్వీడన్‌ లో 3నుంచి 4డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరగ్గా నార్వేలో 3 సెంటీగ్రేడ్‌ లు అధికంగా నమోదయ్యాయి.

- ఫ్రాన్సులో 0.8డిగ్రీలు పెరిగాయి.

- బ్రిటన్ లో 0.20డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

- మార్చి నెలలో నేలపై ఉష్ణోగ్రతలు 2.33డిగ్రీల సెల్సియస్‌ పెరగ్గా సముద్రాల్లో 0.81డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

అయితే.. భూమి విపరీతంగా వేడెక్కడం.. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం ఇప్పుడే తాజాగా వస్తున్న మార్పేమీ కాదు.  25.88లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన భూమి వాతావరణంలో  క్రీస్తుపూర్వం 12సహస్రాబ్ధం నుంచి మార్పులు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

- క్రీస్తుపూర్వం 9,660వ సంవత్సరం నుంచి భూమి వేడెక్కడం మొదలెట్టింది.

- 9,500లో బాల్టిక్‌ సముద్రం పొంగింది. ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. అంటార్కిటికలో మంచు కరగడం మొదలైంది.

- క్రీస్తుపూర్వం 7,370నుంచి నగరాల నిర్మాణం మొదలెట్టారు. 7,100లో ఉత్తర అమెరికాలో మంచుపలకలు జారడం మొదలైంది.

- క్రీస్తుపూర్వం 6,600లో ఉత్తర చైనా సముద్రం వేడెక్కింది. 6000వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు - సముద్రమట్టాలు పెరగడం మొదలైంది.

- మంచు కరిగి 5,600లో బ్లాక్‌ సీకి భారీ వరదలొచ్చాయి. 4,250నుంచి నైలు నది నీటి ప్రవాహానికి అడ్డుకట్టలుపడ్డాయి.

- 2800లో పశ్చిమ యూరోప్‌ - సహర ప్రాంతాల్లోని భూములు ఎడారులుగా మారడం మొదలైంది. క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్ధంలోనే రాతికట్టడాలు మొదలెట్టారు. దక్షిణఇరాక్‌ తో పాటు కారున్‌ - టిక్రీస్‌ నదుల పొడవున భారీ నగరాల నిర్మాణం సాగింది. 2వేల నుంచి 1000వ సంవత్సరం మధ్యలో హరప్పా నాగరికత వెల్లివిరిసింది. ఆ సమయంలోనే మనిషి జీవవైవిద్యాన్ని తన సౌఖ్యం కోసం వినియోగించడం మొదలెట్టాడు. క్రీస్తుశకం 750నుంచి వాతావరణంలో కార్బన్‌ ఉద్ఘారాలు పెరగడం మొదలైంది. తొలిసారిగా దీన్ని జపాన్‌లో గుర్తించారు. అక్కడే గామా కిరణాల ప్రభావం కూడా వెల్లడైంది. ఈ ప్రదేశంలోనే కాస్మిక్‌ కిరణాలు తీవ్రంగా ప్రసరిస్తున్నట్లు అప్పట్లోనే శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు.

-  క్రీస్తుశకం 1080నుంచి వాతావరణంలో అనూహ్యంగా నైట్రోజన్‌ కార్బన్‌ లు పెరిగాయి. ఇది 1350నుంచి మరింత జోరందుకుంది.

- ఆఫ్రికాలో కూడా 20వ శతాబ్ధంలో 4.75డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

- మధ్యప్రాశ్చ్య దేశాల్లో ఇప్పుడు సగటు ఉష్ణోగ్రత 57డిగ్రీల సెల్సియస్‌ కు చేరుకుంది.

- అమెరికాలో కూడా ఇది 49.7డిగ్రీల సెల్సియస్‌ గా నమోదైంది.

- భారత్‌ లో సగటున 43డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంది.

- మన దేశంలోని  రాజస్థాన్‌ లోని జైసల్మీర్‌ లో ఏకంగా ఒకసారి 51డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

- శీతల దేశం నార్వేలో కూడా సగటున 35.6డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలుంటే పోర్చుగల్‌ లో ఏకంగా 47.3డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి.

-ఎప్పుడూ 30డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలుంటే ఇంగ్లాండ్‌ లో కూడా 2003ఆగస్టులో 38.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- అమెరికా లో అయితే 1983లో ఏకంగా 56.7డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- వాతావరణ మార్పుల ప్రభావం కేవలం ఉష్ణోగ్రతల పెరగుదలపైనే కాదు.. ఉష్ణోగ్రతలు పడిపోవడంపై కూడా కనిపిస్తోంది. భారత్‌ లోని జమ్మూకాశ్మీర్‌ లోని డ్రాస్‌ ప్రాంతంలో సగ టున మైనస్‌ 29డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌతుంటే చైనాలో 1969లో ఏకంగా మైనస్‌ 52.3డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలునమోదయ్యాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే భూమి పొగలు కక్కుతోంది. మనిషి జాగ్రత్త పడకపోతే ఏ క్షణమైనా అది వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News