సైన్యంలో తాత్కాలిక ఉద్యోగాలా ?

Update: 2022-04-07 05:38 GMT
త్రివిధ దళాల్లో తొందరలోనే తాత్కాలిక ఉద్యోగవకాశాలు రాబోతున్నాయి. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో తాత్కాలికంగా పనిచేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించబోతోంది.  ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి మార్పులు చేసింది. యువతను సైన్యంలోకి తీసుకురావటానికి కేంద్రం కొత్తగా 'అగ్నిపథ్ ప్రవేశ పథకం' అనే పథకాన్ని తీసుకురాబోతోంది.

కొత్త పథకంలో భాగంగానే యువత మూడేళ్ళపాటు మిలిటరీలో పనిచేయవచ్చు. మూడేళ్ళల్లో యువత పనితీరును పరిశీలిస్తారు. వీరి పనితీరు నూరుశాతం సంతృప్తిగా ఉన్నవారిని మిలిటరీలోకి తీసేసుకుంటారు. మిగిలిన వారిని మిలిటరీ నుండి రిలీవ్ చేసేస్తారు. వాళ్ళకు ఇష్టమైతే వివిధ కంపెనీల్లో సెక్యూరిటీ విభాగాల్లో పనిచేయవచ్చు. మూడేళ్ళ తర్వాత వెళ్ళిపోయే వారికి షార్ట్ మిలిటరీ సర్వీస్ చేసినట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఏదన్నా సెక్యూరిటి సంస్ధల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

ఇక్కడ విషయం ఏమిటంటే మిలిటరీలో సుమారు 1.25 లక్షల ఖాళీలున్నాయి. కరోనా వైరస్ కారణంగా మిలిటరీ రిక్రూట్మెంట్ జరగలేదు, యువత కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఆ సమస్యను అధిగమించేందుకు రక్షణశాఖ సరికొత్త పథకాన్ని తీసుకురాబోతోంది.

దీనివల్ల ఇటు త్రివిధ దళాలకు అటు యువతకు కూడా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారు. త్రివిధ దళాలకు వచ్చే ఉపయోగం ఏమిటంటే శాశ్వత ఉద్యోగాలకు ఇవ్వాల్సిన జీతాలు, బత్యాలు తదితరాల ఖర్చులు తగ్గిపోతాయి.

అలాగే యువతకు తాత్కాలిక మిలిటరీ ఉద్యోగం దొరుకుతుంది. బయటకు వచ్చేసిన వారు తమ దగ్గరున్న షార్ట్ మిలిటరీ సర్టిఫికేట్ తో ఉద్యోగమో లేకపోతే ఉపాధో దొరుకుతుంది. పైగా యువతకు మిలిట్రి డిసిప్లిన్ అలవాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇదే సమయంలో కంటిన్యూయస్ గా మిలిటరీలో దళాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మరి రక్షణశాఖ తీసుకురానున్న కొత్త పథకాన్ని యువత ఏ మేరకు ఉపయోగించుకుంటుందో చూడాల్సిందే. ఎందుకంటే యువత అత్యధికంగా ఉన్నది మనదేశంలోనే కాబట్టి.
Tags:    

Similar News