ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి కత్తిపోట్లకు గురయ్యారు. రెండుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన కిటోవాపై గుర్తు తెలియని ఆగంతుకుడు కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. చెక్ రిపబ్లిక్ లోని ఆమె ఇంటికి వచ్చిన ఆగంతుకుడు.. ఆమెపై కత్తితో దాడి చేశారు. దొంగతనం కోసమే ఆమె ఇంటికి వచ్చిన ఆగంతకుడు ఆమెపై దాడికి యత్నించారు.
ఈ సందర్భంగా ఆమె తనను తాను రక్షించుకునేందుకు చేతులతో అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె ఏడమ చేతి వేళ్లు కత్తిపోట్లకు గురయ్యాయి. ఏడమ చేతి వాటం ఉన్న కిటోవా 2011.. 2014లో జరిగిన వింబుల్డెన్ ట్రోఫీలను గెలుచుకుంది. ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్ లో పదకొండోర్యాంకులో ఉన్న ఆమె.. గ్రాండ్ శ్లామ్ తో సహా 19 టైటిల్స్ గెలుచుకుంది.
కత్తిపోట్లకు గురైన అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసరంగా శస్త్ర చికిత్స జరపాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. దోపిడీ కోసమే ఆగంతకుడు ఆమె ఇంటికి వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నా.. అంతకు మించి ఇంకేమైనా కారణం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/