హుజూరాబాద్ బైపోల్.. టీఆర్ ఎస్, బీజేపీకి ఇండిపెండెంట్ల ఇక్కట్లు.. ఏం జరుగుతోందంటే!
ఈ నెల 30న జరగనున్న ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలకు.. ఇండిపెండెం ట్ అభ్యర్థులు పెద్ద పరీక్షే పెట్టారు. ఇప్పటికే.. నువ్వానేనా.. అనే రేంజ్‌లో అధికార టీఆర్ ఎస్.. ప్రతిపక్ష బీజేపీలు ఇక్కడ పోటీ పడుతున్నాయి. మాజీ మంత్రి... తమ పార్టీ మాజీ నాయకుడు ఈటల రాజేందర్‌ను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించా లని.. అధికార పార్టీ కంకణం కట్టుకుంది. దీంతో ఎక్కడా లేనిశక్తి యుక్తులు అన్నీ..ఇ క్కడ మోహరించింది. అదేసమయంలో దళిత బంధును కూడా అమలు చేస్తోంది. కీలకమైన నాయకులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రి హరీష్ రావు స్వయంగా ఇక్కడి గెలుపును భుజాన వేసుకున్నారు. మరి ఇంత జరిగితే.. బీజేపీ మాత్రం ఊరుకుంటుందా?!
బీజేపీ తరఫున బరిలో నిలిచిన ఈటల కూడా తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఇంటింటి కీ తిరుగుతున్నారు. గెలిచి తీరాలనే కసి.. ఆయన కుటుంబం మొత్తాన్ని హుజూరాబాద్ రోడ్లు పట్టించింది. దీంతో ఇరు పక్షాల మద్య ప్రచారం జోరు.. హోరెత్తిపోతోంది. ఇంత వరకు ఉన్న అవకాశం బట్టి.. టీఆర్ ఎస్, ఈటల దూకుడు ఓ రేంజ్‌లో ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. అంతేకాదు.. పోటీ కూడా నెక్ టు నెక్ ఉంటుందని.. అనుకుంటున్నారు. కానీ, తాజాగా.. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వంటివి ఇప్పుడు.. అటు టీఆర్ ఎస్, ఇటు బీజేపీని కూడా ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి.
ఈ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్, బీజేపీతో పాటు.. కొందరు ఇండిపెండెంట్లు కూడా రంగంలోకి దిగారు. అయితే.. వీరు ఎంచుకున్న ఎన్నికల గుర్తులే ఇప్పుడు ప్రధాన పార్టీలకు, అభ్యర్థులకు ప్రాణసంకటంగా మారాయి. టీఆర్ఎస్, బీజేపీలను ఇరుకునపెట్టేలా ఇండిపెండెంట్లు తమ ఎన్నికల గుర్తులను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ గుర్తు అయిన కారు, బీజేపీ గుర్తు అయిన కమలంను పోలిన పలు గుర్తులను స్వతంత్రులు ఎంచుకోవడంతో ఆ పార్టీల అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న అభ్యర్థుల పేరుతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీనికితోడు పార్టీ సింబల్స్ కూడా ఒకేరకంగా ఉండేలా చూసుకుంటుండటంతో ఓట్లు చీలే అవకాశం భారీగా కన్పిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను పలుచోట్ల ఓటమిపాలు చేశాయి. కారు సింబల్ ను పోలిన ట్రక్కు, రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతి రోలర్, ఆటో రిక్షా, ఇస్త్రీ పెట్టె, బస్సు, లారీ గుర్తులు టీఆర్ఎస్ ఓట్లను గత ఎన్నికల్లో భారీగా చీల్చాయి. ఈక్రమంలోనే ఈ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. టీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు ట్రక్కు, రోడ్ రోలర్, ఆటో సింబల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం తొలగిచింది. అయితే కారును పోలిన చపాతి రోలర్, ట్రాక్టర్, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ గుర్తులను అందుబాటులో ఉంచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కావాలనే ఈ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. బీజేపీ కమలం గుర్తును పోలిన కాలీఫ్లవర్, పైనాపిల్ గుర్తులను ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న ఇ. రాజేందర్ అనే వ్యక్తులు ఎంచుకోవడం ఆసక్తిని రేపుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ లకు చెందిన గుర్తులను పోలిన వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తే ఇరుపార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ విన్పిస్తుంది. అయితే ప్రత్యర్థిని ఓడించే వ్యూహాంలో భాగంగానే ప్రధాన పార్టీలే సింబల్స్ వార్ కు తెరలేపాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ఇటు రాజకీయంగానే కాకుండా.. అభ్యర్థుల పేర్లు.. ఎన్నికల గుర్తులు.. వంటివి కూడా హుజూరాబాద్ ఉప పోరును భోగి మంటలా మండిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.