నరేంద్ర మోడీకి తొందరలోనే మరో షాక్ తగిలే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తొందరలోనే తగులుతుందని అనుకుంటున్న షాక్ మణిపూర్ రాష్ట్రంలో. మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఈ సంకీర్ణంలో బీజేపీ, జేడీయూ, నేషనల్ పీపుల్స్ పార్టీతో పాటు మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ కూటమినుండి జేడీయూ బయటకు వచ్చేయటానికి రెడీ అయినట్లు మణిపూర్లో జేడీయూ యూనిట్ ఇన్చార్జి బీరేన్ సింగ్ చేసిన ప్రకటనతో బీజేపీలో టెన్షన్ మొదలైపోయింది.
నిజానికి బీహార్లో బీజేపీ-జేడీయూ విడిపోగానే మణిపూర్లో కూడా జేడీయూ ప్రభుత్వం నుండి బయటకు వచ్చేస్తుందనే అనుకున్నారు. కానీ ఎందుకనో కాస్త ఆలస్యమైంది. తాము ప్రభుత్వంలో నుండి బయటకు వచ్చేస్తున్నట్లు ఆరుగురు ఎంఎల్ఏలున్న మణిపూర్ జేడీయూ ప్రకటించింది. మణిపూర్లో 60 ఎంఎల్ఏల సీట్లున్నాయి. ఇందులో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి 55 మంది ఎంఎల్ఏలున్నారు. వీరిలో బీజేపీకే 32 మంది ఎంఎల్ఏలున్నారు.
మిగిలిన ఎంఎల్ఏల్లో జేడీయూకి ఆరుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురుండగా మిగిలిన పార్టీలకు కూడా ముగ్గురు, నలుగురు చొప్పున ఎంఎల్ఏలున్నారు. అయితే ప్రభుత్వం లో నుండి బయటకు వచ్చేయటానికి జేడీయూకి ఒక కారణముంది.
మరి మిగిలిన పార్టీలకు వచ్చిన సమస్య ఏమిటి ? ఏమిటంటే మిగిలిన ప్రాంతీయ పార్టీలను బీజేపీ చాలా చిన్నచూపు చూస్తున్నదట. తాము మినహా మిగిలిన అన్నీ పార్టీలు బీ టీములే అని బీజేపీ నేతలు సందర్భం వచ్చినపుడుల్లా ఎద్దేవా చేస్తున్నారట.
ఇపుడు జేడీయూ బయటకు వచ్చేసినంత మాత్రాన ప్రభుత్వం ఏమీ కుప్పకూలిపోదు. కానీ జేడీయూ గనుక మరో మూడు, నాలుగు పార్టీలను గనుక మ్యానేజ్ చేస్తే ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. ఎలాగంటే బీజేపీలోని గ్రూపుల మధ్యే పెద్ద గొడవలు జరుగుతున్నాయట.
బీజేపీలోని కీలకనేత నిమాయచంద్ లువాంగ్ తన మద్దతుదారులతో కలిసి జేడీయూ కండువా కప్పేసుకున్నారు. ఈయనకు నలుగురు ఎంఎల్ఏల మద్దతున్నదట. వీళ్ళు కూడా బీజేపీని వదిలేసి, ప్రాంతీయ పార్టీలు కూడా గుడ్ బై చెప్పేస్తే అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.