జమ్మూలో తాజా ఉద్రిక్తత ఎందుకో తెలిస్తే షాక్ పక్కా?

Update: 2016-06-20 07:19 GMT
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు కామన్. తరచూ ఏదో ఒక గొడవ ఆ రాష్ట్రంలో జరుగుతుంటుంది. భద్రతాదళాల వైఖరిని అక్కడి స్థానికులు తప్పు పట్టటం.. అక్కడి స్థానికుల్లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ భద్రతా దళాలు సందేహాలు వ్యక్తం చేయటం లాంటివెన్నో అక్కడ కనిపిస్తాయి. వీటికి తోడు ఉగ్రవాదుల ఆనవాళ్లు అక్కడ నిత్యం ఘర్షణ వాతావరణం కనిపించేలా చేస్తుంది.

తాజాగా ఇందుకు భిన్నమైన అంశంపై తాజాగా రగడ షురూ కావటం గమనార్హం. జమ్మూలోని పూంచ్ జిల్లాలో హిందూ ఆలయంలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించటంపై ఇప్పుడు వివాదం మొదలైంది. పూంచ్ జిల్లాలోని ఝులాస్ గ్రామంలో ఒక హిందూ ఆలయంలో లౌడ్ స్పీకర్లు వాడటాన్ని అక్కడి మెజార్టీ వర్గమైన ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. లౌడ్ స్పీకర్లు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ముస్లిం వర్గానికి చెందిన కొందరు లౌడ్ స్పీకర్లపై అభ్యంతరం వ్యక్తం చేయటం.. స్పీకర్లను వినియోగించకుండా అడ్డుకోవటం అక్కడ తాజా ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ వివాదం పెరిగి.. రెండు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో ఆలయం దగ్గర భద్రతా సిబ్బందిని మొహరించారు. తాజా పరిణామంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఇలాంటి ఘటనే దేశంలో మైనార్టీల విషయంలో జరిగితే కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు ఒంటి కాలిపై ఎగిరి పడేవి. మరి.. తాజా ఉదంతంపై రాజకీయ పార్టీలు ఏవీ మాట్లాడకపోవటం ఏమిటి? హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదా..?
Tags:    

Similar News