టెన్త్ పరీక్షల గైడ్ లైన్స్ జారీ.. తెలుగు భాష తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు!
కరోనా కారణంగా గతేడాది విద్యార్థుల చదువులే కాదు.. ఈ ఏడాది పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోయిన సంవత్సరం పరీక్షలు లేకుండానే పాస్ చేసిన ప్రభుత్వం ఈ సారి మాత్రం పరీక్షలు నిర్వహించబోతోంది. జూన్ లో ఈ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అయితే.. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుబ్బారెడ్డి బుధవారం విడుదల చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పకడ్బందీగా సూచనలు చేశారు. ఆ వివరాలు చూస్తే...
- టెన్త్ పరీక్షలు మొదటిసారి రాసే విద్యార్థులు అందరూ తెలుగు భాషను ఫస్ట్ లేదా సెకండ్ లాంగ్వేజ్ గా ఖచ్చితంగా రాయాలి.
- తెలుగు మొదటి లాంగ్వేజ్ గా ఉన్న వారు హిందీని తప్పని సరిగా సెకండ్ లాంగ్వేజ్ గా రాయాలి.
- ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మొదటి లాంగ్వేజ్ గా తెలుగును ఎంచుకుంటే.. సెకండ్ లాంగ్వేజ్ గా హిందీని మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి.
- తమిళ్, కన్నడ, ఒరియా తదితర మాతృ భాషలను మొదటి లాంగ్వేజ్ గా ఎంచుకున్న విద్యార్థులు.. సెకండ్ లాంగ్వేజ్ గా తప్పకుండా తెలుగు పరీక్ష రాయాలి.
- ఏడు పేపర్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్ తోపాటు మ్యాథ్స్, సోషల్ పరీక్షలు వంద మార్కులకు ఉంటాయి. బయాలజీ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 50 మార్కుల చొప్పున వేర్వేరుగా నిర్వహిస్తారు.
- మొదటి లాంగ్వేజ్ కాంపోజిట్ మొదటి పేపరు 70 మార్కులకు.. రెండో పేపరు 30 మార్కులకు ఉంటాయి.
- వంద మార్కుల పరీక్ష రాసేందుకు 3 గంటల 15 నిమిషాల సమయం ఇస్తారు.
- 50 మార్కుల పేపరుకు 2 గంటల 45 నిమిషాల సమయం ఇస్తారు.
- 2017 మార్చిలో తొలిసారి టెన్త్ పరీక్షలు రాసి, 2019 జూన్ వరకు పాస్ కానివారు ఈ పరీక్షలకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
- స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణిస్తారు.
- గుర్తింపు ఉన్న స్కూల్ నామినల్ రోల్స్ మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా అప్ లోడ్ చేయాలి.