టెన్త్ రిజల్ట్స్ వాయిదా : ఆ మంత్రి గారి ఎఫెక్ట్ తోనా...?

Update: 2022-06-04 09:33 GMT
జరగక జరగక జగన్ సర్కార్ లో తొలిసారి పదవతరగతి పరీక్షలు జరిగాయి. ఇక పరీక్షల నిర్వహణ టైమ్ లో ఎన్నో వివాదాలు, పేపర్ లీకేజ్ వార్తలు ఇలా చాలానే జరిగింది. దీని మీద రాజకీయ దుమారం కూడా ఒక లెవెల్ లో సాగింది మొత్తానికి టెన్త్ పరీక్షలు ముగిసాయి. ఇపుడు టెన్త్ పరీక్షల రిజల్ట్స్.  కేవలం పాతిక రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటిస్తున్నామని గొప్పగా చెప్పారు.

జూన్ నాలుగున టెన్త్ ఫలితాలు రిజీల్ అన్నారు. అది కూడా విద్యా శాఖ అధికారులు రిలీజ్ చేస్తారు అన్న వార్తతోనే అంతా అవాక్కు అయ్యారు. సాధారణంగా సంబంధిత  విద్యాశాఖ  మంత్రి పరీక్షా ఫలితాలను రిలీజ్ చేస్తారు. అలాంటిది మంత్రి లేకుండానే కానిచ్చేయడం అంటే సదరు మంత్రి గారికి అవమానమే కదా.

మరి ఆయనకు సమాచారం కూడా చెప్పలేదని కూడా ప్రచారం సాగుతోంది.  ఇక జూన్ 4న ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు రిలీజ్ అని అంతా ప్రకటించాక ఇటు విద్యార్ధులతో పాటు అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలల యాజమాన్యాలు అందరూ టీవీలతో పాటు కంప్యూటర్ల దగ్గర‌ తెగ టెన్షన్ తో వేచి ఉన్న వేళ సడెన్ గా ఒక స్క్రోలింగ్ వచ్చింది.

టెన్త్ ఫలితాలు సోమవారానికి వాయిదా అని. దీంతో అంతా డీలా పడారు. అసలే టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్ధుల టెన్షన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. రిజల్ట్స్ వస్తున్నాయి ఇక నిముషంలో సెకనో అనుకునే లోపు వాయిదా రెండు రోజుల పాటు అంటే వారి మానసిక స్థితి గురించి చెప్పాల్సింది లేదు, పేరెంట్స్ సైతం ఉసూరుమన్నారు.

మొత్తానికి పరీక్షల నిర్వహణలో ఎన్నో ట్విస్టులు ఇచ్చారు. ఇపుడు రిజల్ట్స్ విషయంలో కూడానా అని అంతా అనుకోవడం జరుగుతోంది. ఇంతకీ ఈ వాయిదా ఎందుకు జరిగింది అంటే దీని వెనక ఒక కధ ఉందని ప్రచారం సాగుతోంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తెలియకుండా ఆయన లేకుండా అధికారులే టెన్త్ ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో బొత్స హర్ట్ అయ్యారని అంటున్నారు.

అందుకే ఆయన అలిగారని అంటున్నారు. ఈ నేపధ్యంలో మరేమి అనుకున్నారో ఏమో కానీ సోమవారానికి ఫలితాలు వాయిదా వేశారు. మరి ఆ రోజు అయినా బొత్సకి చెప్పి అధికారులు తామే ఫలితాలు రిలీజ్ చేస్తారా లేక బొత్స స్వయంగా వచ్చి ఫలితాలు రిలీజ్ చేస్తారా అన్నదే చూడాలి.

దీని మీద టీడీపీ నేత లోకేష్ అయితే వైసీపీ సర్కార్ మీద ఫైర్ అయ్యారు. పరీక్షా ఫలితాల విషయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించే సర్కార్ ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నామని ఆయన అంటున్నారు. అటు పిల్లలను, ఇటు తల్లిదండ్రులను కూడా తీరని మనోవేదనకు గురి చేశారని విమర్శించారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా ఫలితాలను ప్రకటించడానికి సిద్ధపడి ఇపుడు సడెన్ గా వాయిదా వేశారని ఆయన అంటున్నారు. మొత్తానికి టెన్త్ పరీక్షను ఎందుకు సర్కార్ పాస్ అవడం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న అని అంతా అంటున్నారు.
Tags:    

Similar News