ఘోర రోడ్డు ప్రమాదం..లోయలోకి దూసుకెళ్లిన బస్సు - ఒకరు మృతి - 70 మందికి గాయాలు!
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలో వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 40 అడుగుల మేర లోయలో పడిపోయింది. ఈ ఘటన లో ఒక మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, 70 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి వలసకూలీలు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటన జరిగిన వెంటనే ఘటనస్థలానికి చేరుకున్న స్థానికులు బస్సు అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను బస్సులో నుండి బయటకు తీసుకువచ్చారు. ఈ రోడ్డు ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో 40 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.
డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని రాజ్‌ఘఢ్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైందని, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.