లండ‌న్ ఉగ్ర‌చ‌ర్య సీన్ స్పెయిన్ లో రిపీట్‌

Update: 2017-08-18 04:29 GMT
బాంబుల్లేకుండా పెద్ద ఎత్తున మార‌ణ‌హోమం సృష్టించేలా ఉగ్ర‌వాదులు కొత్త ఎత్తుగ‌డ‌ను ఫాలో కావ‌టం తెలిసిందే.  ఉన్మాదంతో ఊగిపోయే ఉగ్ర రాక్ష‌సులు భారీ వాహ‌నాలతో జ‌న‌స‌మ్మ‌ర్థం ఉన్న ప్రాంతాల్లో దూసుకెళ్ల‌టం.. క‌ల‌క‌లం రేప‌టం.. పెద్ద ఎత్తున ప్రాణాలు తీయ‌టం ఈ మ‌ధ్య‌న మొద‌లైన స‌రికొత్త ఉగ్ర ఆరాచ‌కంగా చెప్పాలి. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ప‌లుమార్లు అమ‌లు చేసిన ఈ మార‌ణ‌కాండ‌ను తాజాగా స్పెయిన్ లో ఉగ్ర‌వాదులు రిపీట్ చేశారు. ఆందోళ‌న క‌లిగించే అంశం ఏమిటంటే.. గంట‌ల వ్య‌వ‌ధిలో రెండుసార్లు ఉగ్ర‌దాడికి ప్ర‌య‌త్నించ‌టం. మొద‌టి ప్ర‌య‌త్నంలో ప‌ద‌మూడు మంది అమాయ‌కులు బ‌లి కాగా.. రెండో ప్ర‌య‌త్నాన్ని మాత్రం అక్క‌డి భ‌ద్ర‌తా ద‌ళాలు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకొని న‌లుగురు అనుమానితుల్ని కాల్చి చంపాయి.

ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంత‌మైన బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్ ప‌ర్యాట‌కుల‌పైకి ఒక వ్యాన్ ను వేగంగా తీసుకొచ్చిన ఉదంతంలో 13 మండి ప్రాణాలు పోగొట్టుకోగా.. 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయిన‌ట్లు చెబుతున్నారు. పాద‌చారుల‌ను ఢీ కొట్టిన వ్యాన్ ఏకంగా అర‌కిలోమీట‌ర్ మేర దూసుకెళ్లారు. దీంతో.. భారీ ప్రాణ‌న‌ష్టం వాటిల్లింది. ఈ దారుణ ఉదంతానికి ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు కార‌ణ‌మై ఉంటార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే.. తొలుత దీన్ని ప్ర‌మాదంగానే భావించిన అధికారుల‌కు.. విచార‌ణ‌లో ఇది ఉగ్ర‌చ‌ర్య‌గా గుర్తించారు.

ఇటీవ‌ల లండ‌న్ మ‌హాన‌గ‌రంలో ఇదే త‌ర‌హాలో ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం.  ప‌ర్యాట‌కుల‌పై వ్యాన్ ను పోనిచ్చిన ఉగ్ర‌వాది.. పలువురి ప్రాణాల్ని తీసిన త‌ర్వాత  వాహ‌నం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌ప్పించుకున్న‌ట్లుగా భావిస్తున్నారు. ఒక బార్ లో దాక్కున్న‌ట్లుగా ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ప‌ర్యాట‌కులు తీవ్ర భాయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వ్యాన్ బీభ‌త్సం చోటు చేసుకున్న రాంబ్లాస్ కు చేరుకున్న పోలీసులు.. తొలుత క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఉగ్ర‌ఘ‌ట‌న చోటు చేసుకున్న ప్రాంతంలోనూ.. ఆ చుట్టుప‌క్క‌ల జ‌న‌సంచారంపై నిషేధం విధించారు. బార్సిలోనాలోని మెట్రోతో పాటు.. ప‌లు ర‌వాణా మార్గాల్ని నిలిపివేశారు. ఇదే త‌ర‌హాలో మ‌రో వాహ‌నంతో దాడి చేసేందుకు వీలుగా సిద్ధం చేసిన వాహ‌నాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

గురువారం చేసుకున్న ఉగ్ర‌ఘ‌ట‌న‌కు కొన్ని గంట‌ల తేడాతో శుక్ర‌వారం ఉద‌యం మ‌రోసారి కామ్ బ్రిల్స్ లో పున‌రావృతం చేయాల‌ని ఉగ్ర‌వాదులు ప్ర‌య‌త్నించారు. ఉగ్ర‌దాడుల సూత్ర‌ధారుల్ని ప‌ట్టుకునేందుకు స్పెయిన్ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ ను చేప‌ట్టారు. వివిధ ప్రాంతాల్లో అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున పోర్ట్ ఆఫ్ కామ్ బ్రిల్స్ లో రెండో ఉగ్ర‌దాడిని భ‌ద్ర‌తా ద‌ళాలు అడ్డుకున్నాయి.  బార్సిలోనా మాదిరే కామ్‌ బ్రిల్స్ లో కూడా ఒక వ్యాన్‌ ను విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌జ‌ల‌పై తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఈఘ‌ట‌న‌లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. బార్సిలోనా ఘ‌ట‌న‌ను పున‌రావృతం చేయాల‌ని భావించిన వారిని కాల్చేశారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు బృతి చెందారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు. గంట‌ల వ్య‌వ‌ధిలో స్పెయిన్ లో చోటు చేసుకున్న ఈ రెండు ఉగ్ర‌దాడులు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

వ‌రుస ఉగ్ర‌ఘ‌ట‌న‌ల‌తో యూరప్ లోని ప‌లు దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఇదే త‌ర‌హా ఉగ్ర‌దాడి ఈ మ‌ధ్య‌న లండ‌న్ బ్రిడ్జ్ ద‌గ్గ‌ర‌..ఏడాది క్రితం ఫ్రాన్స్ లోనూ చోటు చేసుకోవ‌టం తెలిసిందే. స్పెయిన్ ఉగ్ర‌ఘ‌ట‌న‌పై అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల నేత‌లు ఖండిస్తున్నారు.
Tags:    

Similar News