ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో మారణహోమం

Update: 2016-06-29 04:53 GMT
ఉగ్రపంజా టర్కీ రాజధాని ఇస్తాంబుల్ మీద పడింది. అక్కడి ఎయిర్ పోర్ట్ మీద ఉగ్రవాదులు జరిపిన మారణహోమంతో టర్కీ రాజధాని నగరం చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ దారుణంలో దాదాపు 50 మంది మరణించినట్లు జాతీయ మీడియా చెబుతుంటే.. మరో వర్గం మాత్రం 28 మంది మాత్రమే చనిపోయినట్లుగా చెబుతున్నారు.

ఎయిర్ పోర్ట్ ఎంట్రీ పాయింట్ వద్ద జరుపుతున్న తనిఖీల వద్ద ఒక ఉగ్రవాది చేరుకున్న వెంటనే.. తనతో తెచ్చుకున్న ఏకే47తో కాల్పులు జరిపి.. తనను తాను పేల్చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. భారీగా మరణాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. బాంబు దాడితో ఎయిర్ పోర్ట్ ప్రాంతం బీభత్సంగా మారిందని.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని చెబుతున్నారు. ఈ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడింది ఎంతమంది? ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Tags:    

Similar News