గత కొద్దికాలంగా ఉద్రిక్తంగా ఉన్న సరిహద్దుల్లో మరోసారి కలకలం రేగింది. జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. బుధవారం ఉదయం.. బీఎస్ ఎఫ్ వాహనాలపై ఉగ్రవాదులు దాడులు జరపటం.. ఈ దాడిలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో భారత్ సైన్యం ఎదురు కాల్పులు జరిపగా.. ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయి సమీప గ్రామానికి వెళ్లి ముగ్గురిని బంధించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లిన సైన్యం కాల్పులు జరిపి బాధితుల్ని విడిపించింది. అదే సమయంలో ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకొంది. మరో ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయారు.
పారిపోయిన వారి కోసం గాలింపులు తీవ్రతరం చేశారు. ముంబయి కాల్పుల ఘటనలో ఉగ్రవాది కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్న తర్వాత.. మళ్లీ సజీవంగా ఒక ఉగ్రవాదిని పట్టుకోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. సైన్యం అదుపులో ఉన్న ఉగ్రవాది పేరు ఉస్మాన్ గా గుర్తించారు. అతగాడిది పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ గా గుర్తించారు. మరి.. ఈ నయా కసబ్ నోటి నుంచి మరెన్ని విషయాలు వస్తాయో..?