ముస్లింలు కాదని తెలుసుకొని గొంతులు కోసేశారట

Update: 2016-07-04 10:15 GMT
బంగ్లాదేశ్ ఢాకాలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో.. తమ దగ్గర బంధీల గొంతులు కోసేసిన ఉదంతంపై విస్మయకర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఢాకాలో జరిగిన ఉగ్రచర్య మతమౌఢ్యంతో చోటు చేసుకున్నదన్న ఆధారం పక్కాగా దొరికింది. తాజాగా లభించిన వీడియో ఫుటేజ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కరుడు గట్టిన మత ఛాందసవాదులు తీరుతో విదేశీయులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయినట్లుగా తేలింది.

ఢాకాలోని దౌత్య కార్యాలయనికి సమీపంలోని బేకరీ వద్దకు విదేశీయులు పలువురు వస్తుంటారు. వీరిని బంధీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. వారిలో ముస్లింలు అని నిర్ధారించుకున్న వారిని ఏమీ చేయకుండా వదిలేశారు. ఇందులో భాగంగా వారిని ఖురాన్ పంక్తులు చెప్పాలని చెప్పటం.. అలా చెప్పిన వారు ముస్లింలు అని నిర్దారించుకొని వదిలేశారు.

ఇక.. ముస్లింలు కాని అన్య మతస్తులను మాత్రం వారి గొంతులు కోసేసి చంపేశారు. తాజాగా లభ్యమైన వీడియోలో బంధీలుగా చేసుకున్న వారిని బయట నుంచి లోపలకు తీసుకెళ్లే క్రమంలో ఖురాన్ పంక్తులు చెప్పాలనటం కనిపించింది. ఢాకాలోని ఉగ్రవాదుల దుశ్చర్యపై ప్రపంచవ్యాప్తంగా పలువురు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News