క‌శ్మీర్‌ లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు ..ఇద్ద‌రు టీచ‌ర్లు హతం !

Update: 2021-10-07 09:30 GMT
మ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల చర్యలను భద్రతా దళాలు కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులకు దిగుతున్నారు.  జ‌మ్మూక‌శ్మీర్‌ లో ఇవాళ ఉగ్ర‌వాదులు ఇద్ద‌రు ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌ను చంపేశారు. దాంట్లో ఓ మ‌హిళ టీచ‌ర్ ఉన్న‌ది. ఒక‌రు క‌శ్మీరీ పండిట్ కాగా, మ‌రొక‌రు సిక్కు మ‌హిళ‌గా గుర్తించారు. శ్రీన‌గ‌ర్ జిల్లాలోని సంఘం ఈద్గా వ‌ద్ద ఇద్ద‌రు స్కూల్ టీచ‌ర్ల‌ను ఉద‌యం 11.15 నిమిషాల‌కు హ‌త‌మార్చారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని మూసివేశామ‌ని, ఉగ్ర‌వాదుల కోసం అన్వేషిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత‌, మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా, టీచ‌ర్ల హ‌త్య ఘ‌ట‌న‌ను ఖండించారు. అనాగ‌రిక చ‌ర్య‌కు టీచ‌ర్లు బ‌ల‌య్యార‌ని, వారి ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ఒమ‌ర్ ఓ ట్వీట్ చేశారు. మంగ‌ళ‌వారం కూడా ఉగ్ర‌వాదులు ఓ క‌శ్మీరీ పండిట్‌ను చంపిన విష‌యం తెలిసిందే. శ్రీన‌గ‌ర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మ‌సీ షాపు ఓన‌ర్ 70 ఏళ్ల మ‌ఖ‌న్ లాల్ బింద్రూను ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు.

రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌ లో అత‌న్ని కాల్చారు. క‌శ్మీరీ పండిట్ బింద్రూ.. 1990 ద‌శ‌కంలో  ఉగ్ర‌వాదం హెచ్చు స్థాయిలో ఉన్న స‌మ‌యంలోనూ ఫార్మ‌సీ న‌డిపారు. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో మంగ‌ళ‌వారం మృతిచెందిన వారిలో ఓ వీధి వ్యాపారి ఉన్నాడు. బండిపురాలో ట్యాక్సీస్టాండ్ అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ ష‌ఫీని కూడా ఉగ్ర‌వాదులు చంపేశారు. వీధి వ్యాపారిని బీహార్‌ కు చెందిన వీరేంద్ర పాశ్వాన్‌ గా గుర్తించారు.

ఇద్దరు టెర్రరిస్టులు ఒక్కసారిగా స్కూల్ లోకి చొరబడి ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో నలుగురు నుండి ఐదుగురు ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక పై మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులు ముస్లిం టీచర్లను గ్రూప్ నుండి వేరు చేసి ప్రిన్సిపాల్‌ తో సహా ఇద్దరు హిందూ ఉపాధ్యాయులను పాఠశాల భవనం నుండి బయటకు లాక్కొచ్చి స్కూల్ కాంపౌండ్‌లో వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఒక్కసారిగా స్కూల్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

 విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్కూల్ వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి డీజీపీతో సహా ఉన్నత పోలీసు అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ఉగ్రవాదులు ఎవరు అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు మరియు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేసిన వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవటంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ దాడిని ఖండించింది. శ్రీనగర్‌లో ఇద్దరు ఉపాధ్యాయుల హత్యకు సంబంధించిన భయంకరమైన వార్తలు తెరపైకి వస్తున్నాయని పేర్కొంది. ఈ మారణహోమం ఎప్పుడు ముగుస్తుంది అని ప్రశ్నించింది.
Tags:    

Similar News