మణిపూర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల కన్నా తీవ్రవాద గ్రూపులదే కీలక పాత్రట. మణిపూర్లో ఉగ్రవాదుల ప్రభావం చాలా తగ్గిపోయిందని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నాయి. అయితే వాళ్ళ ప్రకటనలన్నీ ఉత్త అబద్ధాలుగా తేలిపోయింది.
ఎందుకంటే వాళ్ళ ప్రకటనలకు క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిస్ధితులకు ఎక్కడా పొంతన కనబడటం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ రాబోతున్నారు.
ప్రధానమంత్రి రాకను బీజేపీయేతర పార్టీలు సహజంగానే పట్టించుకోవటంలేదు. అయితే తీవ్రవాద సంస్ధలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపిచ్చాయి. విచిత్రమేమిటంటే పిలుపుమేరకు రాష్ట్ర బంద్ సక్సెస్ అవ్వడం. బంద్ సందర్భంగా జనజీవనం మొత్తం స్తంబించిపోయింది. దీంతోనే రాష్ట్రంపై తీవ్రవాదుల పట్టేమిటో అందరికీ స్పష్టంగా అర్ధమైపోయింది. మణిపూర్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆరు నిషేధిత తీవ్రవాద గ్రూపులు ఏకమై కోర్ కం అనే సంస్ధగా ఏర్పాటైంది.
స్వతంత్ర మణిపూర్ సాధనే ఏకైక లక్ష్యంగా కోర్ కం పనిచేస్తోంది. నిజానికి వీళ్ళ డిమాండ్ ఆచరణ సాధ్యం కాకపోయినా గ్రూపులన్నీ సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోను పార్టీలపై తీవ్రవాద సంస్ధల ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి వెనుక కచ్చితంగా ఏదో గ్రూపు మద్దతు ఉంటుందనటంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అన్నీ రాజకీయ పార్టీల్లోని కీలక నేతలకు ఏదో గ్రూపుతో కచ్చితంగా సంబంధాలుంటాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లోయ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయాలో డిసైడ్ చేసేవి ఈ గ్రూపులేనట. గ్రూపులు చెప్పిన వాళ్ళకే ఓట్లేస్తామని గ్రామ, ఊరి పెద్దల నుండి కోర్ కం కీలక నేతలు హామీ పత్రాలను తీసుకుంటున్నారు.
ఇచ్చిన హామీ పత్రాలకు భిన్నంగా వేరే అభ్యర్థి గనుక గెలిస్తే గ్రామ, ఊరి పెద్దల పనైపోయినట్లేని సామాజిక కార్యకర్త చెప్పారు. తాజా ఎన్నికల్లో తీవ్రవాదుల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి ఓట్లేస్తారని కొన్ని మీడియా సంస్ధలు అడిగినపుడు జనాలెవరు ఒక్కసారి కూడా నోరిప్పలేదు. దీంతో ఎన్నికల్లో తీవ్రవాద గ్రూపుల ప్రాబల్యం అర్ధమైపోతోంది.