ఫిక్షన్ మూవీస్ లోనూ.. కార్పొరేట్ వార్ మీద సినిమాల్లోనూ.. రెండు కంపెనీలు కోట్లాడుకోవటం సినిమాటిక్ గా చూపించటం తెలిసిందే. ఎత్తులు పైఎత్తులు.. కిడ్నాపులు.. హత్యలు.. ఇలా చాలానే మసాలా కనిపిస్తుంటుంది. రీల్ జీవితంలోని అంశాలంత సినిమాటిక్ గా రియల్ అంశాలు ఉండనప్పటికి.. కంపెనీల వైరం మరోలా ఉంటుంది. అందుకు భిన్నంగా తాజాగా ఇద్దరు కుబేరుల మధ్య మొదలైన వ్యాపార యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాటిక్ గా ఉన్న వీరిద్దరి పోరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
ఇందులో ఒకరు ప్రపంచ కుబేరుడిగా వెలిపోతూ.. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ లలో ఉండే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అయితే.. మరొకరు ఎలక్ట్రికల్ కార్లతో దూసుకొచ్చి.. స్వల్ప వ్యవధిలో లక్షల కోట్లు సంపాదిచిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్.
తాజాగా ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తల మధ్య నాసాకు సంబంధించిన కాంటాక్టు ఒకటి చిచ్చు పెట్టింది. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. వ్యాపారం విషయంలో ఇద్దరూ ఇద్దరే.. పెద్ద ముదురు కేసులుగా ఉండే వీరి తీరు ఉంటుంది. తమ వ్యాపార ప్రయోజనాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేని మైండ్ సెట్ వీరిలో ఉంటుందని చెబుతారు. అలాంటి వీరు నాసా చేపట్టిన మూన్ ప్రాజెక్టు కాంటాక్టు కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.
1972 తర్వాత నాసాకు చెందిన వ్యోమోగాముల్ని మరోసారి చంద్రుడి మీదకు తీసుకెళ్లే పనిలో భాగంగా అంతరిక్ష నౌక కోసం ప్రతిపాదనల్ని కోరటం.. నాసా మ్యూన్ ల్యలాండర్ మిషన్ ను స్పేస్ ఎక్స్ దక్కించుకోవటం తెలిసిందే. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2024లోపు మ్యూన్ లాండింగ్ రాకెట్ ను రెడీ చేయనుంది. అయితే.. చంద్రుడిపై నానా హ్యూమన్ ల్యాండింగ్ మిషన్ లో భాగంగా తప్పులు దొర్లాయని.. ఏకపక్ష రీతిలో కాంటాక్టును టెస్లా అధినేతకు చెందిన స్పెస్ ఎక్స్ కు కట్టబెట్టిన వైనంపై అమెజాన్ అధినేతకు చెందిన బ్లూ ఆరిజిన్ తప్పు పడుతూ కోర్టును ఆశ్రయించింది.
దీంతో కోర్టు దీనిపై అక్టోబరు 14న విచారించేందుకు ఓకే చెప్పటంతో అమెజాన్ అధినేత పంతం నెగ్గినట్లు అయ్యింది. దీంతో.. ఎలన్ మాస్క్ కు చెందిన కంపెనీకి రూ.21,587 కోట్ల కాంట్రాక్ట్ విషయం ఇప్పుడు సందిగ్థంలో పడింది. అంతేకాదు.. ఈ ఏడాది నవంబర్ ఒకటి వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాయి. కోర్టు నిర్ణయంపై స్పేస్ ఎక్స్ స్పందించలేదు. ఈ కొరతను తీరుస్తూ తాజా టెస్లా అధినేత ఎలన్ మస్క్ రియాక్ట్ అయ్యారు. అయితే.. మూన్ ప్రాజెక్టు మీద కాకుండా మరో అంశంపై వచ్చిన ఒక వార్తకు ఆయన స్పందించారు.
స్పేస్ ఎక్స్ కు చెందిన బ్రాడ్ బాండ్ కంపెనీ స్టార్ లింక్ సర్వీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ను ఆశ్రయించింది అమెజాన్. ఈ వార్తను వాషింగ్టన్ పోస్టు రిపోర్టర్ ఒకరు ట్విటర్ లో పోస్టు చేవారు. దీనికి స్పందించిన ఎలన్ మస్క్ స్పందించారు. ‘‘స్పేస్ ఎక్స్ కు వ్యతిరేకంగా దావాలు వేయటం బెసోస్ పనిగా పెట్టుకున్నాడేమో. బహుశా.. అందుకే అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాడేమో’’ అంటూ ఎటకారంగా ట్వీట్ చేశాడు. భారీ కాంటాక్టుపై కొత్త రచ్చ మొదలు కావటం.. ఎలన్ మస్క్ కు చెందిన ప్రాజెక్టుల మీద అదే పనిగా అమెజాన్ అధినేతపై ఆ మాత్రం ఆగ్రహం చెందకుండా ఉంటుందా?