ఉన్నదానితో సరిపెట్టుకోకుండా ఆశకి పోయి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే..ఉన్నది పోతుంది ..ఉంచుకున్నది పోతుంది అన్నట్టు! మనం ఉన్నదానితో ఎక్సట్రాలకి పోకుండా పైకి ఎలా రావాలో ఆలోచించాలి కానీ, ఎక్సట్రాలకి పొతే ఉన్నది మొత్తం పోయే ప్రమాదం ఉంది. ఇది మరోసారి రుజువైంది. చేజేతులా చేసుకున్న పాపానికి .. క్షణాల వ్యవధిలో ఏకంగా 5,500 కోట్ల రూపాయల ఆస్తి కరిగిపోయింది.
అదేంటి ఒక చిన్న తప్పుకి ..అన్ని వందల కోట్లా అని ఆశ్చర్యపోతున్నారు..అది అంతేలెండి కొంచెం ఖరీదైన చిన్న తప్పు ! ఇంతకీ అత్యంత ఖరీదైన ఆ చిన్న తప్పు ఏమిటా అనుకుంటున్నారా...టెస్లా ..ఈ కంపెనీ పేరు దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఏమిచేసినా అది ఒక సంచలనమే. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఒక డెమో చూపిస్తున్న సమయంలో డెమో ఫెయిల్ కావడంతో టెస్లా కంపెనీ షేర్లు భారీగా కుంగిపోయాయి. అలాగే అయన ఆస్తులు కూడా కరిగిపోయాయి.
టెస్లా సంస్థ తాజాగా సైబర్ ట్రక్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ను పరిచయం చేసింది. ఈ సైబర్ ట్రక్ వివరాలను వెల్లడిస్తున్న సమయంలో దాని కిటికీ అద్దాలు అసలు పగలవని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దానిపై మెటల్ బాల్ విసిరి లైవ్‌లో దానిని చూపించాలనుకున్నారు. ఇదే కంపెనీ షేర్స్ కి , అయన ఆస్తులకి ముప్పు తెచ్చిపెట్టింది. ఈ డెమో సమయంలో గురువారం కిటికీ అద్దం పగిలిపోయింది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆటో షోలో ఇది జరిగింది. ఈ ఊహించని పరిణామంతో ఎలాన్ మస్క్ షాక్‌కు గురయ్యారు.
ఆ తరువాత దీనిని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. అయితే ఆలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. లైవ్ డెమో కావడం , అలాగే డెమో ఫెయిల్ కావడంతో టెస్లా షేర్లు పతనమయ్యాయి. పైగా ట్రక్ డిజైన్ కూడా బాగా లేదని ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆయన సంపద ఒక్క రోజులోనే 768 మిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఆయన సంపద 16,00,97,49,80,000కు పైగా ఉంటుంది. కరిగిపోయిన ఆస్తులు మన కరెన్సీలో రూ.5,500 కోట్లకు (768 మిలియన్ డాలర్లు) పైగా ఉంటుంది. కంపెనీ షేర్లు 333.41 డాలర్లకు పడిపోయాయి.