2 నిమిషాల్లో రూ.7 వేల కోట్లు ఉఫ్‌!

Update: 2019-04-05 08:38 GMT
ల‌క్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.7వేల కోట్లు (కాస్త అటూఇటుగా) పోగొట్టుకున్న దుర‌దృష్ట‌వంతుడి వ్య‌వ‌హారం ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఒక సామాన్య జీవి జీవిత కాలంలో అందులో ఒక‌టో వంతు సంపాద‌న కూడా సంపాదించ‌లేని ప‌రిస్థితి. అంత దాకా ఎందుకు.. ఏడు వేల కోట్ల‌ను అంకెల రూపంలో రాయ‌మంటే.. ఏ మాత్రం త‌డ‌బాటు లేకుండా రాసేవారెంద‌రు?

అదే రూ.7వేల కోట్ల‌తో ఏపీలోని ఒక జిల్లా రూపు రేఖ‌లు మొత్తాన్ని మార్చేయొచ్చు. రూ.ఏడు వేల కోట్ల విలువ ఎంతో చెప్ప‌టానికి ఈ ఉదాహ‌ర‌ణ‌లు స‌రిపోతాయి. మ‌రి.. అంత‌టి భారీ మొత్తాన్ని కేవ‌లం రెండంటే రెండు నిమిషాల్లో కోల్పోయిన వ్య‌క్తి వేద‌న ఎంత‌గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవస‌ర‌మే ఉండ‌దు. ఇంత‌కీ ఆ బ్యాడ్ ల‌క్ ఫెలో ఎవ‌రంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

ప్ర‌ముఖ బిజినెస్ టైకూన్.. టెస్లా వ్య‌వ‌స్థాప‌కుడు ఎల‌న్ మ‌స్క్ త‌న సంప‌ద‌లో బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను కోల్పోయారు. అది కూడా కేవ‌లం రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో. కోల్పోయారు. అలా ఎలా జ‌రిగిందంటే.. గురువారం జ‌రిగిన ట్రేడింగ్ లో ఆయ‌న‌కు చెంది టెస్లా షేర్లు కుప్ప‌కూలిపోవ‌టంతో ఆయ‌న భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో గురువారం ట్రేడింగ్ ఆరంభ‌మైన రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో ఆయ‌న కంపెనీకి చెందిన టెస్లా షేర్లు తీవ్ర ఒడిదుడికుల‌కు లోన‌య్యాయి.

దీంతో.. రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో ఆయ‌న షేర్ విలువ 11 శాతం న‌ష్ట‌పోయింది. దీంతో ఎల‌న్ మ‌స్క్ సంప‌ద 1.1 బిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గి 22.3  బిలియ‌న్ డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. దీంతో.. ఎల‌న్ ఆస్తి భారీగా త‌గ్గింది. టెస్లా వాహ‌నాల అమ్మ‌కాలు త‌గ్గిపోవ‌టం.. సంస్థ ప‌ని తీరు మీద వెలువ‌డుతున్న నెగిటివ్ టాక్ కూడా షేర్ల క్షీణ‌త‌కు కార‌ణంగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సంస్థ షేర్ల విలువ భారీగా క్షీణించింది.ఇప్పుడు అర్థ‌మైందా?  రెండు నిమిషాల్లో అంత భారీ మొత్తం ఎలా న‌ష్ట‌పోయారో?
Tags:    

Similar News