రయ్‌.. రయ్‌ .. త్వరలోనే మన రోడ్లపై టెస్లా చక్కర్లు

Update: 2021-07-23 10:30 GMT
దేశియ రోడ్లపై టెస్లాకార్లు ఎప్పుడు తిరుగుతాయా అని ఆతృతగా ఎదురు చూస‍్తున్న అభిమానులకు టెస్లా శుభవార్త తెలిపింది. యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ లో హిందీ లాంగ్వేజ్‌ ను యాడ్‌ చేసింది. దేశంలో చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఈవీ మార్కెట్‌ పై కన్నేసిన ఆటోమొబైల్‌ సంస్థలు ఈవీ వాహనాల్ని తయారు చేసి, భారత్‌ లో విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నాయి.

ఈనేపథ్యం లో ప్రముఖ ఈవీ వెహికల్‌ టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ త్వరలో భారత్‌ లో టెస్లా కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్‌ లో ఐటీహబ్‌ గా పేరొందిన బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి హెడ్‌ గా ప్రశాంత్‌ ఆర్‌.మీనన్‌ ను ఎంపిక చేశారు. ప్రశాంత్‌ మీనన్‌ సైతం టెస్లా కార్లను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టెస్లా కార్‌ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ లో రష్యన్‌, గ్రీక్‌, ఫిన్నిష్ క్రొయేషియన్ లాంగ్వేజ్‌ తో పాటు హిందీ లాంగ్వేజ్‌ ను యాడ్‌ చేసింది.

దీనితో ఇండియన్‌ ఆటోమొబైల్‌ నిపుణులు టెస్లా కారు ఇండియన్‌ రోడ్ల పై తిరిగే సమయం దగ్గరలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్‌ లో టెస్లా మోడల్‌ 3 కార్‌ ట్రయల్స్‌ నిర్వహించారు.ఈ ట్రయల్స్‌ లో రోడ్లపై టెస్లా కార్ల డ్రైవింగ్‌ సులభంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. దీనితో టెస్లా మోడల్‌-3 రెడ్‌ కలర్‌ కార్‌ ను బెంగళూరులో డెలివరీ చేసింది. భారత్‌ లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు ధర రూ.70 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. టెస్లా మోడల్ -3 అమెరికన్‌ మార్కెట్లో ప్రారంభ ధర సుమారు రూ .30 లక్షలు ($ 39,990) కు విక్రయిస్తున్నారు. కార్లపై అధిక కస్టమ్స్ సుంకం విధించడం వల్ల, భారత్‌ కు వచ్చే  టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ .70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. 
Tags:    

Similar News