అత్యాచార నిందితులకు టెస్టోస్టిరాన్ ఇంజక్లన్లు..: ఇక జీవితంలో..: థాయ్ లాండ్ లో అమలు..

Update: 2022-07-13 05:03 GMT
అత్యాచారం కేసులో నిందితుడిని ఏం చేస్తారు..? ఘటన తీవ్రతను భట్టి శిక్ష వేస్తారు. కొన్ని దేశాల్లో నడి వీధిలో నరికేస్తారు. కానీ థాయ్ లాండ్ లో అత్యాచారం చేసేవారిని సర్చికల్ కాస్ట్రేషన్ కు గురిచేస్తారు. ఇలా చేయడం వల్ల మరోసారి ఆ వ్యక్తి అత్యాచారినికి పాల్పడలేడు. అంతేకాకుండా అతనికి అలా చేయాలని కూడా అనిపించదు. కేవలం జైలు శిక్ష విధించడం.. ఇతర శిక్షలు అమలు చేస్తున్నా ఈ ఘటనలు ఆగడం లేదు.

దీంతో సర్చికల్ కాస్ట్రేషన్ ద్వారా కాస్త ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చని థాయ్ లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. సర్చికల్ కాస్ట్రేషన్ పై ఇదివరకే దిగువ సభ్యుల ఆమోదం తెలపగా.. తాజాగా ఎగువ సభ కూడా ఆమోదించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్చికల్ కాస్ట్రేషన్ అంటే ఏమిటి..? ఆ శిక్షను ఎలా అమలు చేస్తారు..?

ప్రపంచ వ్యాప్తంగా అత్యాచార ఘటలను విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ దేశం.. ఇ దేశం అని కాకుండా ప్రతీ దేశంలోనూ అత్యాచార బాధితులు పెరిగిపోతున్నారు. అయితే కొన్ని దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అయినా తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త మార్గంలో వెళ్తోంది థాయ్ లాండ్ ప్రభుత్వం. కెమికల్ కాస్ట్రేషన్ ద్వారా అత్యాచార ఘటనలు తగ్గించొచ్చని భావిస్తోంది. సర్చికల్ కాస్ట్రేషన్  అంటే.. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని భవిష్యత్ లో మరోసారి సెక్స్ లో పాల్గొనకుండా చేయడం. సైక్రియాట్రిక్, అంతర్గత మెడిసిన్ స్పెషలిస్టుల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి.

అందరి ఆమోదం తెలిపితే నేరస్తుడి శరీరంలోకి టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గించే ఇంజెక్షన్లు ఇస్తారు. అయితే సర్చికల్ కాస్ట్రేషన్ కు ఒప్పుకున్న నేరస్తుడికి జైలు శిక్ష తగ్గుతుంది. హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లును న్యాయశాక పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందని ఆ ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా ఎగువ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును 145 సభ్యులతో ఆమోదం పొందింది. పార్లమెంట్ మొత్తంలో 147 మంది సభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలను రెడీ చేస్తున్నారు.

సర్చికల్ కాస్ట్రేషన్ కేవలం థాయ్ లాండ్ లోనే కాకుండా పలు దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. పాకిస్తాన్, పోలాండ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. అలాగే నార్వే, డెన్మార్క్, జర్మనీలోనూ దీనిని పాటిస్తున్నారు. సర్చికల్ కాస్ట్రేషన్ తో నేరస్తుడు మరోసారి లైంగిక క్రియల్లో పాల్గొనడలేడు. దీంతో అత్యాచారాలు తగ్గుతున్నాయని అంటున్నారు.

కానీ కొందరు మాత్రం ఈ ప్రక్రియ తో మహిళలపై దాడులు ఆగవని అంటున్నారు. నేరస్తుడిలో లైంగిక సామర్థ్యం తగ్గిన వ్యక్తిలో ఆవేశం పేరుకుపోయి మరిన్ని దాడులకు పాల్పడుతారని అంటున్నారు. మహిళలపై దాడులకు సెక్స్ ఒక్కటే కారణం కాదని అంటున్నారు. కానీ సర్చికల్ కాస్ట్రేషన్  భయంతో కొందరు వెనుకడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News