సినిమా నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినవారు ఎంతమంది అనే విషయం కాసేపు పక్కనపెడితే... పక్కా ప్లానింగ్ తో, కరెక్ట్ స్టాటజీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవారు మాత్రం కచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతారని అంటుంటారు పరిశీలకులు. ఈ క్రమంలో తాజాగా దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఫిక్స అయినట్లు తెలుస్తుంది!
ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత... సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రులుగా పనిచేసిన స్టార్స్. అనంతర కాలంలో చాలామంది రంగంలోకి దిగినప్పటికీ సక్సెస్ కాలేక కాడి మధ్యలోనే వదిలేసినవారు కొందరైతే... ఇంకా బండి నడిపిస్తున్న వాళ్లు మరికొందరు! ఆ సంగతి అలా ఉంటే... తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. ఇందులో భాగంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది.
అవును... దళపతి విజయ్ పాదయాత్రకు సన్నద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అటు సినీ రంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలోనూ ఈ న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తోందని అంటున్నారు. అయితే... గతకొన్ని రోజులుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి!
ఈ మధ్యకాలంలో ఈ స్టార్ హీరో... "విజయ్ మక్కల్ ఇయక్కం" అభిమాన సంఘం సభ్యులతో తరచూ భేటీ అవుతున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో 10, 10+2 లో టాప్ ర్యాంక్స్ లో పాసయిన వారిని సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేధికపై రాజకీయాల్లో ఓటుకు నోటు విషయంపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో... ఇక పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవ్వాలని, అందులో భాగంగా ముందుగా పాదయాత్ర చేసి, సామాన్యుల కష్టాలపై పరిజ్ఞానం తెచ్చుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే... తన తాజా చిత్రం "లియో" విడుదల కంటే ముందే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని అంటున్నారు.
కాగా... విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "లియో" అక్టోబర్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే! సో... ఈ లోపే విజయ్ తన పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తుంది!