మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా ఎమ్మెల్యేలను గెలుచుకోనప్పటికీ గోవాలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అదిరిపోయే పంచ్ వేశారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం కావాల్సిన ఎమ్మెల్యేలను షాపింగ్ లో వస్తువుల కొన్నట్లు కొనుగోలు చేశారని మండిపడ్డారు. అధికార దాహంతో ఎమ్మెల్యేలను కొన్నారని, అది సిగ్గుచేటు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా ప్రజలను మోసం చేశారని, వాళ్లకు క్షమాపణలు చెప్పాలని గోవా సీఎం మనోహర్ ను ఉద్దేశిస్తూ దిగ్విజయ్ ఇవాళ ట్వీట్స్ చేశారు.
కాగా, శుక్రవారం రాజ్యసభకు వచ్చిన గోవా సీఎం మనోహర్ పారికర్ అక్కడ దిగ్విజయ్‌పై కామెంట్స్ చేశాడు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. అలా అవడం తాను సీఎం కావడానికి వీలు కల్పించిందని, అందుకు దిగ్విజయ్ సింగ్ కు థ్యాంక్స్ అంటూ ఎటకారం ఆడారు. ఈ సందర్భాన్ని దిగ్విజయ్ తన ట్వీట్ లో ప్రస్తావిస్తూ.... థ్యాంక్ తనకు కాదని - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి థ్యాంక్స్ చెప్పాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలను షాపింగ్ చేసిన గడ్కరీకి పారికర్ థ్యాంక్స్ చెబితే బాగుంటుందన్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు గోవా రాష్ట్ర ప్రజలకు పారికర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు.
కాగా, రాజ్యసభకు వచ్చిన పారికర్ చైర్మన్ - డిప్యూటీ చైర్మన్ - సభ్యులకు వీడ్కోలు పలికారు. తను రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సభ్యులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పారు. వారు కోరుకున్నప్పుడల్లా గోవాకు రావచ్చని పారికర్ ఆహ్వానం పలికారు. గోవా సీఎంగా ప్రమాణం చేసే ముందు రక్షణమంత్రిగా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పారికర్ సభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్, రాజీవ్‌గౌడ, రజినీ పాటిల్ తదితరులు లేచి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గోవా గవర్నర్ మృదులా సిన్హా బీజేపీని ఆహ్వానించకుండా ఉండాల్సిందన్నారు. ఆమె ప్రవర్తనపై చర్చించడానికి సభలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంపై ఇంకా చర్చించాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/