థాంక్యూ టీచ‌ర్ .. ఓవ‌ర్ టు క‌ర్ణాట‌క

Update: 2022-05-31 23:30 GMT
మంచి ఎక్క‌డున్నా ప్రేమించ‌డంలో బాధ్య‌త ఉంది. బాధ్య‌త తెలిసిన గురువు కేవ‌లం మంచి బోధ‌కుడే కాదు మంచిని పంచే స్నేహితుడు కూడా ! ఆప‌ద‌లో సాయం ఉండే బంధువు కూడా!  ఆ విధంగా ఆ టీచ‌ర్ ఇప్పుడు కొంద‌రు పేద బిడ్డ‌ల చ‌దువుల క‌ల సాకారానికి సాయం అందించారు. క‌ర్ణాట‌క వాకిట జ‌రిగిన ఈ క‌థ ఆద‌ర్శ‌నీయం.

మొన్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు త‌న‌కు వ‌చ్చిన డ‌బ్బులు (పెన్ష‌న్ బెనిఫిట్స్ ) తీసుకుని పోయి ఆడ బిడ్డ‌ల కోసం ప్ర‌ధాని సుర‌క్షా  యోజ‌న కింద దాచారు. 88 మంది బాలిక‌ల చ‌దువుల‌కు ఆ డ‌బ్బు ఎంతో అవ‌స‌రం. ఇవ‌న్నీ  అని కొట్టి పారేయ కూడ‌దు. ఇప్పుడు మ‌రో టీచ‌ర్..  ఆమె కేర‌ళ టీచ‌ర్.. పేదింటి బిడ్డ‌ల‌కు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు.

కర్ణాటక లోని శిమోగా జిల్లా హోసనగర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు రేఖా కునాల్ గురించే ఇదంతా ! తాను పాఠాలు చెబుతున్న స్కూల్ లో పిల్ల‌ల చ‌దువు కోసం కొంత ఆర్థిక సాయం చేయాల‌ని నిర్ణ‌యించారు. పేద బిడ్డ‌లంతా ఆ బ‌డికి వ‌స్తారు.

పాపం వాళ్ల చ‌దువు ఆగిపోతే అని ఆలోచించి ఒక్కొక్క‌రి పేరునా వెయ్యి రూపాయ‌లు చొప్పున డిపాజిట్ చేశారు. ప‌దేళ్ల త‌రువాత వ‌డ్డీ తో విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

అక్క‌డి కెన‌రా బ్యాంకులో ఈ మొత్తాన్నీ దాచారు. ఇప్పుడు బిడ్డ‌లంతా ఒక్క‌సారి గట్టిగా థాంక్ యూ టీచ‌ర్ అని అరుస్తున్నారు. మా మంచి టీచ‌ర్ అని పొగుడుతున్నారు. ఆమె చేసిన ఆ చిన్న ప‌ని వ‌ల్ల ఆ బ‌డికి వ‌చ్చే పిల్ల‌ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు దాత‌ల సాయం కూడా అందుతోంది.

ఇంకొంద‌రి పేరిట కూడా మ‌నీ డిపాజిట్ చేయాల‌ని యోచిస్తున్నారామె. తాను కూడా పేద కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని త‌న‌లాంటి వారికి సాయం అందించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని అంటున్నారామె. 2014 నుంచి తాను ఈ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నాన‌ని అంటున్నారామె.
Tags:    

Similar News