ఆ ఛాన్స్‌ నా భార్యకు మాత్రమే!

Update: 2015-04-10 19:04 GMT
 కుల వివక్ష, మతం, మూఢ విశ్వాసాలు ఇటువంటివి భారతదేశంలోనే ఉన్నాయని చాలా మంది అనుకుంటుంటారు కానీ... ఇటువంటి జాడ్యాలకు ఏ దేశమూ, ఏ మతమూ అతీతం కాదని నిరూపించే పనికి పూనుకున్నారు లారా హైవుడ్‌ (42) అనే పెద్ద మనిషి. కలిసి బోజనం చేయడం, వివాహం చేసుకోవడం కాదు... ఏకంగా పక్కన కూర్చోడానికి కూడా వీలు లేదంటూ వివక్ష చూపించాడు. విమానంలో తన పక్క సీటులో ఆ మహిళ ఉంటే ప్రయాణించడం సాధ్యంకాదని విమానంలో కాస్త రచ్చ చేశాడు!

అసలేం జరిగిందంటే... న్యూయార్క్‌ నుండి లండన్‌ వెళ్లే విమానం రన్‌ వే మీద సిద్దంగా ఉన్న విమానంలో కిటికి పక్కన యూదు మతానికి చెందిన లారా హైవుడ్‌ అనే వ్యక్తి కుర్చుని ఉన్నారు. ఆయన సీటు పక్కన ఫ్రాన్స్‌ స్కా హోగి (40) అనే మహిళ సీటు ఉంది. ఫ్రాన్స్‌ స్కా భర్తతో కలిసి విమానంలోకి వెళ్లింది. తర్వాత హైవుడ్‌ పక్కన ఉన్న సీటులో కుర్చోవడానికి ఆమె వెళ్లింది. ఆ సమయంలో హైవుడ్‌... తన పక్క సీటు లో కుర్చోవడానికి వీలు లేదని మరెక్కడైనా కుర్చోవాలని రుబాబు చేశాడు. ఈ విషయలో.. ఎందుకు కూర్చోకూడదని ప్రశ్నించిన ఆమెకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు హైవుడ్‌. తన పక్కన తన భార్య మాత్రమే కుర్చోవడానికి తమ మతం అంగీకరిస్తుందని, వేరే వారు కుర్చోవడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వీలు లేదని అతను సమాధానం చెప్పాడు. జరుతుగున్న రచ్చను చూసిన ఈమె భర్త... స్కా హోగిని తన సీటులో కూర్చోమని, ఈయన వెళ్లి ఆ లారా హైవుడ్‌ పక్కన కూర్చున్నాడు. తాను నల్లజాతి సంతతికి చెందిన మహిళను కాబట్టే పక్క సీటులో కుర్చోనివ్వలేదని ఫ్రాన్స్‌ స్కా విమానం దిగిన తరువాత విమానాశ్రయం అధికారుల దగ్గర వాపోయారు!
Tags:    

Similar News