కరోనా పుణ్యమా అని మాస్కు అన్నది జీవితంలో భాగమైంది. మొదటి వేవ్ లో బయటకు వెళ్లినప్పుడే మాస్కు కాస్తా.. సెకండ్ వేవ్ లో ముఖానికి రెండు మాస్కులతో పాటు.. ఇంట్లోనూ మాస్కు తప్పనిసరిగా మారింది. ఇలాంటి వేళ.. మాస్కు లేని మునపటి రోజులు ఎప్పడంటూ ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు మాస్కు లేకుండా బయట తిరిగేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక చిట్టి దేశం వ్యాక్సిన్ కు.. మాస్కుకు లింకు పెడుతూ చేస్తున్న ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి.
కనీసం ఒక్క డోసు తీసుకున్నా.. జులై నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ దక్షిన కొరియా ప్రధాని కిమ్ బూ క్యుమ్ ఊరిస్తున్నారు. ఆ దేశ జనాభా కేవలం 5.2 కోట్లు మాత్రమే. ప్రధాని మాట విన్నంతనే.. వావ్ అనుకుంటాం కానీ.. కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే అసలు విషయం అర్థం కాక మానదు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆ దేశంలో 7.7 శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. రానున్ననాలుగు నెలల్లో (సెప్టెంబరు నాటికి) 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు.
7.7 శాతం నుంచి 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయటం అంత తేలికైన విషయం కాదు కదా. అందుకే.. టీకాకు.. మాస్కుకు లింకు పెట్టేసి.. వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఉత్సాహాన్ని ప్రదర్శించేలా చేస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 1.37లక్షల మంది కరోనా బారిన పడితే.. దాదాపు 2 వేల మంది వరకు మరణించారు. కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ తో మహమ్మారి మరింత విస్తరించకుండా ఉండటం కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలతో పాటు.. వ్యాక్సినేషన్ మీద ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు.. ఉత్సాహంగా ముందుకు వచ్చేందుకు మాస్కు మాటతో ఆ దేశ ప్రధాని చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. మరి.. దక్షిన కొరియా ప్రజలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.