ఆయన్ని చాణక్యుడిని చంపి పుట్టారని అస్మదీయులు తెగ పొగుడుతారు. బాబు లాంటి విజన్ ఎవరికీ లేదు అంటారు. వ్యూహల పుట్ట అని కొనియాడతారు. అయితే చంద్రబాబు చేసిన తప్పులు కూడా చాలానే ఉన్నాయి. అవి ప్రత్యర్ధులు వరసగా ఏకరువు పెడతారు. వాటిలో బాబు అన్నీ ఒప్పుకోరు. కానీ తనకు తోచిన వాటిలో కొన్ని ఆయన కూడా లెక్కేసుకుని తప్పు చేశాను అని అనుకున్న సందర్భాలు ఉంటాయా అంటే ఉంటాయని బాలయ్యతో ఆయన చేసిన టాక్ షోలో చెప్పుకుని ఒప్పుకున్నారు.
చంద్రబాబు సీఎం గా ఉమ్మడి ఏపీలో ప్రభ వెలిగిపోతున్న రోజులు అవి. ఆయన ధాటికి దూకుడుకూ ఎవరూ అసలు కంటికి ఆనని పరిస్థితి. అదే ఊపులో బాబు విజన్ 2020 అనేశారు. అంటే ఏకంగా అప్పటికి మరో ఇరవయ్యేళ్ల పాటు తానే సీఎం అని ఆయన భావన ధీమా అన్న మాట. పరిస్థితులు అపుడు చూస్తే అలాగే ఉన్నాయి. కానీ చంద్రబాబు కూడా ఆ అతి ఆత్మవిశ్వాసంతో కొన్ని తప్పులు చేసుకుంటూ పోయారు. అలా ఆయన చేసిన తప్పుల్లో ఒకటిని ఆయనే ఒప్పుకున్నారు.
అదే 2004లో ఆరు నెలల ముందుకు ఎన్నికలు జరిపి ముందస్తుకు వెళ్ళడం. దాని వల్ల తాను తిరిగి బంపర్ మెజారిటీతో గెలుస్తాను అని ఆయన భావించారు. అయితే దానికి ముందు 2003లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలిపిరిలో చంద్రబాబు మీద మావోల అటాక్ జరిగింది. దాంట్లో చంద్రబాబు బాగా గాయపడ్డారు. దాంతో చంద్రబాబు తనకు సానుభూతి వస్తుందని, ఈ దెబ్బతో మూడవసారి వరసగా సీఎం అయిపోవచ్చు అనుకుని 2024 ఏడాది అంతానికి జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలు ముందుకు జరిపించారు.
అలా తోసుకువచ్చిన ఎన్నికల విషయంలో కేంద్రాన్ని కూడా ముగ్గులోకి లాగారని చెబుతారు. దాంతో అక్కడ వాజ్ పేయ్ ఇక్కడ బాబు ఇద్దరూ ముందస్తుకు వెళ్తే కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. అప్పటికే వైఎస్సార్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ని మంచి హీట్ లో పెట్టారు. జనాల్లో కూడా ఒక పవర్ ఫుల్ లీడర్ గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. అంతే కాదు ఆయన బాబును ఢీ కొట్టే సరిజోడి అని జనాల చేత మార్కులు వేయించుకున్నారు.
అలాంటి రాజకీయ వాతావరణం బయట ఉంది. దానికి తోడు అప్పటికి తొమ్మిదేళ్ళ బాబు పాలనలో ఆయన సంక్షేమాన్ని పక్కన పెట్టి సంస్కరణలను తెచ్చారని, పేదలకు ఏమీ మేలు జరగడంలేదని వామపక్షాలు కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టాయి. అపుడే పుట్టిన తెలంగాణా ఉద్యమం కూడా బాబు పాలన మీద వ్యతిరేకతను పెంచింది.
ఇలా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తాను ఏపీ సీఈఓను అని చెప్పుకోవడానికి ఇష్టపడే చంద్రబాబు నేను కాక ఇంకెవరు సీఎం అని దూకుడుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 47 సీట్లకు పడిపోయింది. ఒక విధంగా ఘోరమైన ఓటమిగానే అంతా చూశారు. అయితే బాలయ్య టాక్ షోలో బాబు ముందస్తుని వెళ్ళి అతి పెద్ద తప్పు చేశాను అని చెప్పుకునారు కానీ నిజానికి ఆయన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లినా ఇవే రకమైన ఫలితాలు వచ్చేవి అని అప్పట్లో విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే బాబు మీద వ్యతిరేకత బాగా ఉంది. అది ఆయన గ్రహించలేదు.
ఇపుడు ఏపీలో ముందస్తు అంటున్నారు. జగన్ ఎన్నికలకు వచ్చే ఏడాది వెళ్తారని అంటున్నారు. అయితే జనాల్లో ఒకసారి వ్యతిరేకత కనుక వస్తే ముందస్తు అయినా షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరిగినా జనాలు ఓడించి తీరుతారు అనే అంటున్నారు. ఇక దేశంలో చాలా రాష్ట్రాలో ముందస్తు ఎవరికీ పెద్దగా అచ్చిరాలేదు. కేంద్రంలో వాజ్ పేయ్ కి కూడా ముందస్తు కలసిరాలేదు. అయితే 2018లో ఒక్క కేసీయార్ మాత్రమే ఆ యాంటీ సెంటిమెంట్ ని దాటి మళ్లీ గెలిచారు. ఏది ఏమైనా బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోయి ఉంటే మరో ఆరు నెలల పాటు సీఎం గా ఉండేవారు అన్నది నిజం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.