అమిత్ షా ట్విట్టర్ ఖాతా బ్లాక్ అవడానికి కారణం అదే!

Update: 2021-01-22 05:55 GMT
గత గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయింది. ఇది సంచలనంగా మారింది. గురువారం రాత్రి అమిత్ షా ఖాతా నుంచి ప్రొఫైల్ చిత్రం  మాయమై పోయింది. ఆయన ఖాతా  ప్రొఫైల్ చిత్రం స్థానంలో ఈ చిత్రం కనబడటం లేదు అని రాసి ఉంది.సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ల దుర్వినియోగం నిరోధించడం, డిజిటల్ స్పేస్ లో మహిళల భద్రత ఎజెండాపై గురువారం ట్విట్టర్,ఫేస్ బుక్ భారత ప్రతినిధులు పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులు హోంమంత్రి ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారంటూ వారిని ప్రశ్నించారు. అమిత్ షా  పోస్ట్ చేసిన ఓ చిత్రంపై కాపీ రైట్ ఉండటంతో నవంబర్లో ఆయన ఖాతాను  తాత్కాలికంగా నిలిపినట్లు ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ఆ తరువాత బ్లాక్ చేసినట్లు వివరించారు. వెంటనే తమ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకుంటామని ప్రస్తుతం ఆయన ఖాతా పూర్తిస్థాయిలో పని చేస్తుందని వారు వివరణ ఇచ్చారు.

 ఆయన ప్రొఫైల్ చిత్రంపై తనకు కాపీరైట్లు ఉన్నట్లు  ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత ఆయన ఖాతాను అన్ బ్లాక్ చేశామని  వారు తెలిపారు. గ్లోబల్ కార్పొరేట్ విధానాల వల్ల అమిత్ షా ఖాతాను నిలిపి  వేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత వెంటనే తమ తప్పు సరిదిద్దు కున్నామని  అధికార ప్రతినిధి తెలిపారు. కాగా అమిత్ షా ఖాతా స్తంభింప  చేయడం పట్ల  ట్విట్టర్ పై నెటిజన్లు విమర్శలు  చేస్తున్నారు.
Tags:    

Similar News