ఆ జడ్జిది యాక్సిడెంట్ కాదు..పక్కా హత్య, సీసీటీవీ వీడియోలో బయటపడ్డ నిజం !

Update: 2021-07-30 05:29 GMT
ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ జడ్జి మృతి కేసు కీలక మలుపు తీసుకుంది. ఉత్తమ్ ఆనంద్ అనే ఈ జడ్జి హఠాత్తుగా మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు మొదట వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి, దీనిన రోడ్డు యాక్సిడెంట్ లో ఆయన మరణించినట్టు చూపడానికి యత్నించినట్టు పోలీసులు కనిపెట్టారు.

సీసీటీవీ ఫుటేజీలో ఇది స్పష్టంగా కనిపించింది. బుధవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కగా జాగింగ్ చేస్తుండగా ఆయనను వేగంగా వచ్చిన టెంపో ఢీ కొట్టి వెళ్ళిపోయింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఆ టెంపో కావాలనే ఆయన వెనుకవైపు నుంచి ఢీ కొంది.. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు.

ఈ సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆ టెంపో డ్రైవర్ ను, మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ, హైకోర్టు జస్టిస్ తో మాట్లాడి దీనిపై దృష్టిపెట్టాలన్నారు. దీంతో పోలీసులు పక్కాగా ఎంక్వయిరీ మొదలు పెట్టారు. సీసీ టీవీ ఫుటేజీ వెలికి తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అది ప్రమాదం కాదు, పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్య అని తేలింది.

ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ కోసం బయటకు వచ్చారు. ఇంటి నుంచి అర కిలోమీటర్ దూరం కూడా రాలేదు, అంతలోనే ఆటో వచ్చి ఢీకొంది. జడ్జి రోడ్డు పక్కనే వెళ్తున్నా, ఆటో నేరుగా ఆయన్ని ఢీ కొనడానికే వచ్చినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. అంతకు ముందు రోజే ఆటోని దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు.

ధన్ బాద్ జిల్లాకోర్టు జడ్జి మృతి కేసును సుప్రీంకోర్టు తనకు తానుగా విచారించాలని ఈ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఇది ఓ కుట్ర ప్రకారమే జరిగిందని, ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడేనని ఈ అసోసియేషన్ పేర్కొంది. ఓ కేసులో ఈ జడ్జి బహుశా ప్రతివాదులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందువల్ల ఆయనపై పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు.

పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా..లాయర్లు పలు కేసులు వాదిస్తుంటారు. జడ్జీలు తీర్పులు చెబుతుంటారు. ఈక్రమంలో వారికి కొన్ని కేసుల్లో కొంతమంది శతృవులు కూడా ఏర్పడతారు. అలాగే జడ్జి ఉత్తమ్ ఆనంద్ విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనీ..ఓ కేసులో ఉత్తమ్ బహుశా ప్రతివాదులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందువల్ల ఆయనపై పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.
Tags:    

Similar News