ఉమ్మడి ఏపీలోగాని.. విభజిత ఏపీలోని గాని నెల్లూరు జిల్లా రాజకీయమే వేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలు.. వారికి దీటుగా ఎదిగిన వ్యక్తులు.. కొత్త తరం రాజకీయం కలబోత ఉమ్మడి నెల్లూరు జిల్లా. గతంలో ఈ జిల్లా పేరు చెప్పగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి కుటుంబాలు. వీరికి సమఉజ్జీగా రాజకీయాల్లో ఎదిగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పి.అనిల్ కుమార్ యాదవ్. వైసీపీతో కోటంరెడ్డి, అనిల్ కుమార్ బాగా వెలుగులోకి వచ్చారు. ఇక మేకపాటి కుటుంబంలో గత ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వకున్నా.. ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డిని మంత్రిని చేసి వైఎస్ జగన్ ప్రాధాన్య తగ్గకుండా చూశారు. వీరి కుటుంబంలో మరో కీలక వ్యక్తి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మూడుసార్లు గెలిచిన ఈయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అనిల్ కుమార్ గతేడాది మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. తర్వాత కొంత అసమ్మతి స్వరం వినిపించినా.. సర్దుబాటు అయ్యారు.
ఘన విజయం తెచ్చిన వర్గ విభేదాలు టీడీపీ, వైసీపీ రెండింటికీ బలమైన పట్టున్న జిల్లా నెల్లూరు అని చెప్పక తప్పదు. ఇక బీజేపీ పరంగా చూస్తే వెంకయ్యనాయుడు వంటి దిగ్గజ నాయకుడిని అందించిందీ జిల్లా. కాగా, వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచే వచ్చినా.. కొంతకాలం తర్వాత రాజ్యసభ వైపు వెళ్లిపోయారు. ఉప రాష్ట్ర్రపతి అయ్యాక ప్రత్యక్ష రాజకీయాల జోలికే వెళ్లలేదు. మరోవైపు నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. పదికి పదిస్థానాలను ఆ పార్టీనే గెల్చుకుంది. టీడీపీ తరఫున కచ్చితంగా గెలుస్తారని అనుకున్నవారంతా అడ్రస్ లేకుండా పోయారు. ఆ ఘన విజయం ఇచ్చిన జోష్ లోనే వైసీపీలో వర్గ విభేదాలూ పొడ సూపాయి.
గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే నిరాశలో ఉన్నారు. ఆయన పార్టీని వీడడం దాదాపు ఖాయమే. ఇక జగన్ కు వీరాభిమానిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. మరో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై వ్యక్తగత ఆరోపణలు వచ్చాయి. అయితే, పార్టీపరంగా ఆయన ఎక్కడా హద్దులు దాటలేదు. ఓ యువకుడు తాను చంద్రశేఖర్ రెడ్డి కుమారుడిని అంటూ క్లయిమ్ చేసుకున్నా.. ఆ తర్వతా వివాదం పెద్దగా వార్తల్లో నిలవలేదు. ఇక ఆ ఎమ్మెల్యే ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలోనూ చేరారు.
ముచ్చటగా మూడో ఎమ్మెల్యే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఉమ్మడి నెల్లూరుకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ అని కచ్చితంగా చెప్పక తప్పదు. వీరిలో మొదటి ఇద్దరు కోటంరెడ్డి, ఆన కాగా.. మరొకరు ఎవరనేది సస్పెన్స్. కోటంరెడ్డి, ఆనంలను ఎలాగో వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పించారు కాబట్టి టికెట్ రాదొని చెప్పొచ్చు. ఇక మిగిలిన మూడో ఎమ్మెల్యే ఎవరంటే.. ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తేనని అంటున్నారు. ఆయనకు టికెట్ రాదని వైసీపీ అధిష్ఠానమే తేల్చి చెప్పిందంట. వ్యక్తిగత ఆరోపణలు అనే కాక.. ఆయన మీద ఎందుకో అధిష్ఠానానికి గుడ్ లుక్ లేదని సమాచారం. మరోవైపు ఈ ఎమ్మెల్యే కుటుంబానికి వైసీపీ అధిష్ఠానంలో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ అదేమీ మరోసారి టికెట్ ఇవ్వడానికి ప్రాతిపదికగా నిలవబోవడం లేదని తెలిసింది. మొత్తమ్మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున మూడు కొత్త ముఖాలు నెల్లూరు జిల్లా బరిలో నిలవనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.