తెలుగుదేశం పార్టీకి మహానాడు అతి పెద్ద వేడుక. ఏడాదికి ఒకసారి పార్టీ పరిస్థితిని సమీక్షించుకుని జనాల్లోకి తిరిగి వెళ్ళడం నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్ళ కరోనాతో మహానాడు జూమ్ మీటింగులకే పరిమితం అయినా ఈసారి మాత్రం ఉత్సాహపూరితమైన వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇదిలా ఉంటే మహానాడులో ఈసారి అనేక సంచలనాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఈసారి మహానాడు ఒంగోలు వేదికగా సాగనుంది. అక్కడ గతంతో పోలిస్తే మంచి పట్టుని పార్టీ సాధించింది. ఇంకో వైపు చూస్తే పార్టీ అధినాయకుడు చంద్రబాబు వరసబెట్టి చేస్తున్న జిల్లాల టూర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఎన్నికల సమరోత్సాహం మొదలైపోయింది.
ఇంకో వైపు చూస్తే మహానాడులో ధాటీగా తన రేపటి రాజకీయం ఇదీ అని టీడీపీ చెప్పబోతోంది. అదే సమయంలో పార్టీకి దాదాపుగా నాలుగేళ్ల తరువాత సరికొత్త జోష్ ఇచ్చే విధంగా ఈసారి సభలూ సమావేశాలూ ఉండబోతున్నాయని అంటున్నారు. ఈసారి మహానాడులో ఇతర పార్టీల నుంచి వెల్లువలా చేరికలు ఉంటాయని అంటున్నారు.
అయితే ముందుగా ద్వితీయ శ్రేణి నాయకులే అన్ని పార్టీల నుంచి వచ్చి చేరుతారు అని అంటున్నారు. ఇక బీజేపీ నుంచి అయితే ప్రధాన నాయకులు పార్టీలో చేరుతారు అని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీజేపీకి రాజీనామా చేసి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన మహనాడులోనే టీడీపీలో చేరుతారు అని తెలుస్తోంది.
అదే విధంగా మూడేళ్ళ క్రితం వివిధ కారణాలతో పార్టీని వీడి వెళ్ళిన పెద్ద నాయకులలో కొందరు మహానాడు ద్వారా తిరిగి సొంత పార్టీలోకి వస్తారని అంటున్నారు. వారికి ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఇక అధికార వైసీపీ విషయానికే వస్తే తమ గ్రాఫ్ తాము చూసుకుని సొంత అంచనాలకు వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలో ఫ్యూచర్ లో చేరవచ్చు అంటున్నారు.
అయితే వారికి అధినాయకత్వం భరోసా ఇస్తే కనుక ఈ జంపింగ్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో ఉన్న కొందరు సీనియర్ సీనియర్లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు అంటున్నారు. వారిని కూడా చేర్చుకుంటే తమకు మరింత పట్టు వస్తుందని టీడీపీ కూడా ఆలోచన చేస్తోంది. ఆ విధంగా సీమ జిల్లాలతో పాటు, గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇలా పెద్ద ఎత్తున నాయకులు కనుక టీడీపీలో చేరితే ఎన్నికలకు చాలా ముందుగానే రాజకీయం మారుతుంది అంటున్నారు. టీడీపీకి జనాదరణ ఉందన్న సంకేతం ఒక్కసారి జనాలతో వెళ్తే గెలుపు అవకాశాలను ఎవరూ ఆపలేరు అని కూడా అంటున్నారు. మొత్తానికి భారీ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్న టీడీపీ ఈసారి మహానాడుతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. ఇక తమతో పొత్తు వద్దు అంటున్న బీజేపీని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున అక్కడి నేతలకు గేలం వేస్తోందని కూడా చెబుతున్నారు.