చెపాక్‌ నుండి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆ స్టార్ హీరో !

Update: 2021-03-12 12:30 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్షపార్టీ అయిన డీఎంకే పార్టీ శుక్రవారం 173 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ కోలాథూర్‌ నుంచి మళ్లీ బరిలో నిలుస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేంటంటే , ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ తొలిసారిగా చెన్నై లోని చెపాక్ నియోజక వర్గం నుండి బరిలో నిలవబోతున్నారు. మాజీ మంత్రులు అరుణ, సురేష్‌ రాజన్‌, కన్నప్పన్‌, మాజీ స్పీకర్‌ అవుడియ్యప్పన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే డీఎంకే ఐటీ వింగ్‌ చీఫ్‌ పీటీఆర్‌ తియాగరాజన్‌, టీఆర్‌ బాలు తనయుడు టీఆర్‌బీ రాజా పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. సీనియర్లు దురై మురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, కే పొన్ముడి, ఎంఆర్‌ కే పన్నీర్‌ సెల్వంతో పాటు ఎక్కువగా సిట్టింగ్ ‌లకే స్టాలిన్‌ సీట్లు కేటాయించారు.

ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్‌ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. ఈ నెల 15న నామినేషన్లు వేసి, ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నట్లు పేర్కొన్నారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లు కూటమి కేటాయించగా.. మిగతా 173 స్థానాల్లో డీఎంకే పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ సారి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని డీఎంకే చూస్తోంది. అలాగే పలు సర్వేలు కూడా డీఎంకే కి అనుకూలంగా ఉండటంతో డీఎంకే నేతలు రెట్టింపు ఉత్సహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ 187 స్థానాల్లో పోటీ చేయనుంది. 47 సీట్లను పొత్తులో భాగంగా బీజేపీ సహా పలు పార్టీలకు కేటాయించింది. వచ్చే నెల 6న తమిళనాడులో ఎన్నికలు జరుగనున్నాయి.
Tags:    

Similar News